Telugu Global
Cinema & Entertainment

అదరగొట్టిన అరవింద సమేత

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. నైజాంలో రికార్డు వసూళ్లు సాధించడంతో పాటు.. అదనపు షోల కారణంగా ఏపీలో కూడా ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వచ్చాయి. దసరా కానుకగా నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు నైజాం లో అచ్చంగా 5 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రికార్డుల మోతలో భాగంగా ఇది కొన్ని నాన్-బాహుబలి రికార్డులు కూడా క్రియేట్ చేసింది. నైజాంతో పాటు సీడెడ్, […]

అదరగొట్టిన అరవింద సమేత
X

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. నైజాంలో రికార్డు వసూళ్లు సాధించడంతో పాటు.. అదనపు షోల కారణంగా ఏపీలో కూడా ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వచ్చాయి. దసరా కానుకగా నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు నైజాం లో అచ్చంగా 5 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

రికార్డుల మోతలో భాగంగా ఇది కొన్ని నాన్-బాహుబలి రికార్డులు కూడా క్రియేట్ చేసింది. నైజాంతో పాటు సీడెడ్, ఉత్తరాంధ్ర, గుంటూరులో నాన్-బాహుబలి రికార్డులు ఇప్పుడు అరవింద సమేత పేరిట నమోదయ్యాయి.

అటు ఓవర్సీస్ లో కూడా ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. ప్రీమియర్స్ తో కలుపుకొని ఈ సినిమా అప్పుడే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. ఏకంగా 10లక్షల డాలర్లు ఆర్జించింది. అక్కడ కూడా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇటు దేశీయంగా, అటు ఓవర్సీస్ పరంగా జై లవకుశ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్ ఇలా ఉంది.

నైజాం – రూ. 5.73 కోట్లు
సీడెడ్ – రూ. 5.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.12 కోట్లు
ఈస్ట్ – రూ. 2.77 కోట్లు
వెస్ట్ – రూ. 2.37 కోట్లు
గుంటూరు – రూ. 4.14 కోట్లు
కృష్ణా – రూ. 1.97 కోట్లు
నెల్లూరు – రూ. 1.06 కోట్లు

First Published:  12 Oct 2018 6:08 AM GMT
Next Story