Telugu Global
NEWS

ఎ.పి.యు.డ‌బ్ల్యు.జె. రాష్ట్ర ఉపాధ్య‌క్షునిగా జ‌య‌రాజ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ యూనియ‌న్ ఆఫ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్స్ట్ (ఎ.పి.యు.డ‌బ్ల్యు.జె.) ఉపాధ్య‌క్షునిగా కంచ‌ల జ‌య‌రాజ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కూ యూనియ‌న్ డిప్యూటీ జ‌నర‌ల్ సెక్రెట‌రీగా ఉన్న జ‌య‌రాజ్ విజ‌య‌వాడ ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షునిగా కూడా ప‌నిచేశారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో జ‌రిగిన యూనియ‌న్ 35వ రాష్ర్ట మ‌హాస‌భ‌ల్లో కొత్త క‌మిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్య‌క్షునిగా ఎన్నిక‌యిన కంచ‌ల జ‌య‌రాజ్ 27ఏళ్లుగా జ‌ర్న‌లిజం వృత్తిలో ఉన్నారు. ఈనాడు, వార్త దిన‌ప‌త్రిక‌ల్లో సుదీర్గ‌కాలం పాటు ప‌నిచేశారు. ప్ర‌స్తుతం 10టీవీలో డిప్యూటీ ఇన్‌ఫుట్ ఎడిట‌ర్‌గా […]

ఎ.పి.యు.డ‌బ్ల్యు.జె. రాష్ట్ర ఉపాధ్య‌క్షునిగా జ‌య‌రాజ్‌
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ యూనియ‌న్ ఆఫ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్స్ట్ (ఎ.పి.యు.డ‌బ్ల్యు.జె.) ఉపాధ్య‌క్షునిగా కంచ‌ల జ‌య‌రాజ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కూ యూనియ‌న్ డిప్యూటీ జ‌నర‌ల్ సెక్రెట‌రీగా ఉన్న జ‌య‌రాజ్ విజ‌య‌వాడ ప్రెస్ క్ల‌బ్ అధ్య‌క్షునిగా కూడా ప‌నిచేశారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో జ‌రిగిన యూనియ‌న్ 35వ రాష్ర్ట మ‌హాస‌భ‌ల్లో కొత్త క‌మిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్య‌క్షునిగా ఎన్నిక‌యిన కంచ‌ల జ‌య‌రాజ్ 27ఏళ్లుగా జ‌ర్న‌లిజం వృత్తిలో ఉన్నారు.

ఈనాడు, వార్త దిన‌ప‌త్రిక‌ల్లో సుదీర్గ‌కాలం పాటు ప‌నిచేశారు. ప్ర‌స్తుతం 10టీవీలో డిప్యూటీ ఇన్‌ఫుట్ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎం.ఎ (ప‌బ్లిక్ అడ్మినిస్ర్టేష‌న్‌), ఎం.ఎ.(జ‌ర్న‌లిజం), ఎం.ఎ(తెలుగు), టెలివిజ‌న్ జ‌ర్న‌లిజంలో పి.జి.డిప్లొమో చేశారు. వార్త బ్యూరో ఇన్‌ఛార్జిగా ప‌నిచేసే స‌మ‌యంలో వృత్తిలో చూపిన ప్ర‌తిభ‌కు సంస్థ 10దేశాల‌లో ప‌ర్య‌టించే అవ‌కాశం క‌ల్పించింది. జ‌ర్న‌లిజంలో కొత్త‌వారిని త‌యారుచేయ‌డం కోసం వివిధ జ‌ర్నలిజం కోర్సులు నిర్వ‌హించే కాలేజీలు,యూనివ‌ర్శిటీల్లో క్లాసులు బోధిస్తుంటారు.

వివిధ దిన‌ప‌త్రిక‌ల్లో స‌మ‌కాలీన అంశాల‌పై వ్యాసాలు రాస్తుంటారు. ఎ.పి.యు.డ‌బ్ల్యు.జె.లో నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ త‌ర్వాత జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌పై అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం జ‌ర్న‌లిస్టుల గృహాలు, స్థలాల కోసం ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తేవ‌డం, డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడేష‌న్లు, హెల్త్ కార్డులు పెంచ‌డం, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌ జ‌ర్న‌లిస్టుల‌కు నెల‌కు 10వేల రూపాయ‌ల పింఛ‌న్ ఇవ్వాల‌ని, జ‌ర్న‌లిస్టుల ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌సును 65 ఏళ్ల‌కు పెంచాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వీటిని సాధించ‌డం కోసం ప్ర‌భుత్వంపై వ‌త్తిడి తెస్తామ‌ని తెలిపారు.

First Published:  11 Oct 2018 8:01 PM GMT
Next Story