Telugu Global
NEWS

గులాబీ పార్టీ రెండో లిస్ట్ ఇదేనా?

అమావాస్య వెళ్లింది. అసంతృప్తుల బుజ్జ‌గింపులు ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఇక మిగిలింది 14 మంది లిస్ట్ విడుద‌ల చేయ‌డ‌మే. గురువారం మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల జాబితాను టీఆర్ఎస్ విడుద‌ల చేయ‌బోతుంది. అయితే పాత‌బ‌స్తీలోని ఎంఐఎంకు ప‌ట్టున్న రెండు స్థానాల‌కు మాత్రం టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఇంకా ఖ‌రారు చేయ‌లేద‌ని తెలుస్తోంది. 12 మంది గులాబీ జాబితా మల్కాజిగిరి — మైనంపల్లి హన్మంతరావు ఖైరతాబాద్ — దానం నాగేందర్ మేడ్చ‌ల్ — ఎంపీ మల్లారెడ్డి ముషీరాబాద్ — ముఠా గోపాల్ గోషామహల్ […]

గులాబీ పార్టీ రెండో లిస్ట్ ఇదేనా?
X

అమావాస్య వెళ్లింది. అసంతృప్తుల బుజ్జ‌గింపులు ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఇక మిగిలింది 14 మంది లిస్ట్ విడుద‌ల చేయ‌డ‌మే. గురువారం మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల జాబితాను టీఆర్ఎస్ విడుద‌ల చేయ‌బోతుంది. అయితే పాత‌బ‌స్తీలోని ఎంఐఎంకు ప‌ట్టున్న రెండు స్థానాల‌కు మాత్రం టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఇంకా ఖ‌రారు చేయ‌లేద‌ని తెలుస్తోంది.

12 మంది గులాబీ జాబితా

  • మల్కాజిగిరి — మైనంపల్లి హన్మంతరావు
  • ఖైరతాబాద్ — దానం నాగేందర్
  • మేడ్చ‌ల్ — ఎంపీ మల్లారెడ్డి
  • ముషీరాబాద్ — ముఠా గోపాల్
  • గోషామహల్ — ప్రేమ్ సింగ్ రాథోడ్
  • అంబర్ పేట — ఎడ్ల సుధాకర్ రెడ్డి
  • వరంగల్ తూర్పు — నన్నపనేని నరేందర్
  • చొప్పదండి — రవి శంకర్
  • హుజుర్ నగర్ — సైదిరెడ్డి
  • జహీరాబాద్ — ఎర్రోళ్ల శ్రీనివాస్
  • కోదాడ — వేనేపల్లి చందర్ రావ్
  • వికారాబాద్ — రామచందర్

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని మ‌ల్కాజిగిరి, మేడ్చ‌ల్‌లో సిట్టింగ్‌ల‌కు ఈ సారి టిక్కెట్లు ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక్క‌డ మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు, ఎంపీ మ‌ల్లారెడ్డికి టికెట్ ఇస్తున్నారు. ఇక దానం నాగేంద‌ర్‌కు ఎట్ట‌కేల‌కు ఖైర‌తాబాద్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ టికెట్ ఆశించిన విజ‌యారెడ్డి కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే టాక్ ఉంది.

ముషీరాబాద్ టికెట్ ఆశించిన హోంమంత్రి నాయిని న‌ర్సింహ‌రెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి కి ఈ సారి చాన్స్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ముఠా గోపాల్‌కే మ‌రో సారి అవ‌కాశం ఇవ్వొచ్చు. అంబ‌ర్‌పేట‌, గోషామ‌హ‌ల్ కూడా పాత‌వారికి ఫైన‌ల్ అయింద‌ని గులాబీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌.

ఇటు కొండా సురేఖ పార్టీ మార‌డంతో వ‌రంగ‌ల్ తూర్పు టికెట్ మేయ‌ర్ న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌కు ఇవ్వొచ్చు. ఇక్కడ టికెట్ ఆశించిన బ‌స్వ‌రాజు సార‌య్య ఏం చేస్తార‌నేది తెలియాల్సి ఉంది.

చొప్ప‌దండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ‌కు టికెట్ ఇవ్వ‌లేమ‌ని ఇప్ప‌టికే తేల్చిచెప్పారు. దీంతో ఆమె కండువాలు లేకుండా ఇప్ప‌టికే సెంటిమెంట్ ప్ర‌చారం మొదలెట్టారు. జ‌హీరాబాద్ ను ఎర్రొళ్ల శ్రీనివాస్‌కు రిజ‌ర్వ్‌ చేశార‌ని అంటున్నారు.

హుజూర్‌న‌గ‌ర్‌లో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై పోటీకి ఇద్ద‌రు ఎన్ఆర్ఐలు పోటీ ప‌డితే… చివ‌ర‌కు దూకుడు మీదున్న ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి టికెట్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి గులాబీ లిస్ట్ ఫైన‌ల్ అయింది. గురువారం రిలీజ్ చేస్తార‌ని వినికిడి.

First Published:  9 Oct 2018 8:38 PM GMT
Next Story