Telugu Global
Others

స్త్రీ పురుష సమానత్వం ఎండమావే!

జలంధర్ లోని ఒక మాజీ బిషప్ రెండేళ్ల కాలంలో తమ మీద అనేక సార్లు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని ఒక క్రైస్తవ సన్యాసిని ఆరోపించారు. దీనికి అయిదుగురు సన్యాసినులు ఆమె తరఫున నిరసన వ్యక్తం చేశారు. ఇది కేరళలోని కాథలిక్ చర్చి మహిళల విషయంలో అభ్యంతరకరమైన వైఖరి ఏమిటో, ఈ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్థం అవుతోంది. ఈ సందర్భంలో నిరసనలో రెండు అంశాలు గమనించాలి. మొదటిది-తమ మత విశ్వాసానికి, ఆచరణకు నిలయమైన చర్చికి […]

స్త్రీ పురుష సమానత్వం ఎండమావే!
X

జలంధర్ లోని ఒక మాజీ బిషప్ రెండేళ్ల కాలంలో తమ మీద అనేక సార్లు లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారని ఒక క్రైస్తవ సన్యాసిని ఆరోపించారు. దీనికి అయిదుగురు సన్యాసినులు ఆమె తరఫున నిరసన వ్యక్తం చేశారు. ఇది కేరళలోని కాథలిక్ చర్చి మహిళల విషయంలో అభ్యంతరకరమైన వైఖరి ఏమిటో, ఈ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్థం అవుతోంది.

ఈ సందర్భంలో నిరసనలో రెండు అంశాలు గమనించాలి. మొదటిది-తమ మత విశ్వాసానికి, ఆచరణకు నిలయమైన చర్చికి వ్యతిరేకంగా క్రైస్తవ సన్యాసినులు నిరుపామానమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. రెండవది, తమకు న్యాయం జరగాలని కోరిన సన్యాసినులకు సానుభూతి, సహకారం లభించడం. ఈ నిరసన “నేను సైతం” (మీ టూ) ఉద్యమం ప్రారంభమైన తర్వాత తలెత్తడం ఒక ఎత్తయితే మతాధికారులు బాలల మీద మహిళల మీద అత్యాచారాలకు పాల్పడడం మరో ఎత్తు. వాటిని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్న మాట.

ఈ ఉదంతం కేరళలోని కాథలిక్ చర్చి ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. కానీ ఈ అఘాయిత్యాలలో అసలు విషయం బాధితులకు న్యాయం జరగడం, స్త్రీ పురుష సమానత్వానికి విఘాతం కలగడం.

పవిత్రత అన్న భావన ఉన్న చోట వ్యక్తిలో ఉండే విధ్వంసక, శారీరక సుఖాలకు సంబంధించిన, కామాతురత, పశుప్రాయమైన అంశాలు ఉండకూడదనుకుంటాం. వ్యక్తుల గౌరవాన్ని చర్చి పరిరక్షించాలి. నైతిక, భౌతిక అంశాలను కాపాడాలి. ఈ సందర్భంలో క్రైస్తవ సన్యాసినుల గౌరవాన్ని పరిరక్షించాలి.

ఈ నేపథ్యంలోనే క్రైస్తవ సన్యాసినులు అపోస్తలిక్ నన్సియో ఇండియాకు చెందిన సైరో-మలబార్ కాథలిక్ చర్చి వారికి తమ గోడు గురించి అర్జీ పెట్టుకున్నారు. రోంలోని చర్చి అధికారులకు, వాటికన్ విదేశాంగ అధికారికి కీడా ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణ ఉన్న బిషప్ కు వ్యతిరేకంగా అత్యాచారానికి గురైన క్రైస్తవ సన్యాసిని తరఫున ఉద్యమించారు. కానీ చర్చి ఈ అంశాన్ని పట్టించుకోవడంలో జాప్యం చేసినందువల్ల బాధితులకు న్యాయం జరగనే లేదు. పైగా చర్చి అధికారులు బాధితురాలైన సన్యాసిని మీద అభాండాలు వేయడానికి ప్రయత్నించారు. ఆమె శీలాన్ని శంకించారు.

అంటే న్యాయం కలగజేయడానికి బదులు చర్చి అధికారులు పక్షపాతంతో వ్యవహరించారు. అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించిన కేరళ హైకోర్టు ఆయనకు జామీను నిరాకరించింది. ఈ విషయంలో చర్చి అంతర్గతంగా జరిపిన దర్యాప్తును కూడా అనుమానించింది.

చర్చి తన పిత్రుస్వామిక నైతికతను కొనసాగించడంలో భాగంగా స్త్రీ పురుష సమానత్వాన్ని చర్చి “ఆంతరంగిక” విషయమని, దాన్ని తామే పరిష్కరించుకుంటామని వాదించింది. బాధితురాలైన సన్యాసిని తనకు న్యాయం జరగాలని బహిరంగంగా కోరడంవల్ల తమ సముదాయం గౌరవానికి భంగం కలిగిందని కూడా వాదించింది. సముదాయం అన్న వాదన చేయడంవల్ల న్యాయం జరగడానికి అడ్డంకులు సృష్టించడమే అవుతుంది.

అత్యాచార బాధితుల నోళ్లు మూయించడానికి పిత్రుస్వామిక భావజాలాన్ని ఆశ్రయించడం మామూలైపోయింది. ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం కొత్తేమీ కాదు. ఇది చర్చిలో ఉన్న అసమానతలను బహిర్గతం చేస్తోంది. చర్చిలో స్త్రీలను మత పరంగా పవిత్రులుగా భావిస్తారు కాని పురుషులైన మతాధికారులకు ఉండే హోదా మహిళలకు ఇవ్వరు.

బిషప్ కు మత నియమాల రీత్యా అధికారం అబ్బుతుంది. అధికార హోదాలో పురుషుడిని అధికుడిగా భావిస్తారు. చర్చిలో అనేక కార్యక్రమాల మీద పెత్తనం పురుష మతాధికారులదే. అందువల్ల చర్చిలో స్త్రీ పురుష సంబంధాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. బిషప్ మీద అసమ్మతి వ్యక్తం చేయడాన్ని ఆమోదించరు. అలా చేయడం చర్చి మీద దాడి చేయడంగా భావిస్తారు. దీనివల్ల నిరసనకు అవకాశం ఉండదు. సన్యాసినులు అణచివేతకు గురి అవుతారు. వారి నోరు నొక్కేస్తారు. న్యాయం జరగకుండా దారులన్నీ మూసేస్తారు.

అలాంటి సమయంలో విచిత్రంగా చర్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తుంది. కాథలిక్ చర్చికి క్రైస్తవుల ఓట్ల మీద గణనీయమైన పట్టు ఉంటుంది. ఇది కేరళ మధ్య ప్రాంతంలో మరింత ఎక్కువ. కేరళ జనాభాలో 18.4 శాతం మంది క్రైస్తవులే. అందులో 60 శాతం మంది కాథలిక్కులు. అందువల్ల చర్చి నిరంతరం రాజకీయ అంశాల్లో పెత్తనం కొనసాగించగలుగుతోంది.

కేరళలో కాలూనడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నందువల్ల వామపక్ష ఫ్రంట్ బాధితుల గోడు పట్టించుకోవడం లేదు. అలాగే ప్రతిపక్షమూ క్రైస్తవుల నిరసనకు మద్దతు ఇవ్వడం లేదు. రాజకీయ పార్టీల మౌనానికి ఓటు బ్యాంకు రాజకీయాలే కారణం. న్యాయం జరగడానికి సకల అవకాశాలూ వమ్ము చేస్తున్నారు.

అయితే స్త్రీ పురుష సమానత్వంపై ఒక వేపు చర్చి, మరో వేపు రాజకీయ పార్టీలు కాళ్లీడుస్తున్నా ప్రజల స్ఫూర్తిని మాత్రం దెబ్బ తీయలేక పోతోంది. నిరసన కొనసాగిస్తున్న సన్యాసినులకు లౌకిక వాదులు మద్దతు ఇస్తున్నారు. క్రైస్తవ సమాజంలోని కొన్ని వర్గాలు, పౌర సమాజ వ్యవస్థలు, మహిళా సంఘాలు, కళాకారులు, మీడియా నిరసన గళం వినిపిస్తున్న సన్యాసినులతో గొంతు కలుపుతున్నాయి.

నిరసన తెలియజేస్తున్న సన్యాసినులకు సమకూరుతున్న మద్దతు చూస్తే లింగ సమానత్వంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇది స్త్రీ పురుష సమానత్వానికి వ్యతిరేకంగా వేళ్లూనుకున్న భావనను నిర్మూలించడానికి సహాయపడుతుంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  9 Oct 2018 6:03 PM GMT
Next Story