Telugu Global
Cinema & Entertainment

నోటా వీకెండ్ వసూళ్లు

మొత్తానికి ఎలాగోలా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది నోటా సినిమా. విజయ్ దేవరకొండ, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తొలి వారాంతం వరల్డ్ వైడ్ 9 కోట్ల 25 లక్షల రూపాయలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది. 18 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో (మొదటి 3 రోజులు) అటుఇటుగా 10 కోట్ల రూపాయలు ఆశించారు. కానీ […]

నోటా వీకెండ్ వసూళ్లు
X

మొత్తానికి ఎలాగోలా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది నోటా సినిమా. విజయ్ దేవరకొండ, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తొలి వారాంతం వరల్డ్ వైడ్ 9 కోట్ల 25 లక్షల రూపాయలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

18 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ లో (మొదటి 3 రోజులు) అటుఇటుగా 10 కోట్ల రూపాయలు ఆశించారు. కానీ మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో శని, ఆదివారాలు ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఏపీ, నైజాంలో నోటా ఫస్ట్ వీక్ కలెక్షన్ ఇలా ఉంది.

నైజాం – రూ. 3.23 కోట్లు
సీడెడ్ – రూ. 0.96 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.80 కోట్లు
ఈస్ట్ – రూ. 0.52 కోట్లు
వెస్ట్ – రూ. 0.32 కోట్లు
గుంటూరు – రూ. 0.61 కోట్లు
కృష్ణా – రూ. 0.47 కోట్లు
నెల్లూరు – రూ. 0.29 కోట్లు

First Published:  8 Oct 2018 5:05 PM GMT
Next Story