Telugu Global
NEWS

అడ్డంగా బాబు బుక్‌.... ట్వీట్‌ను డిలీట్ చేయడం మరిచి....

సరిగ్గా 2014కు ముందు చంద్రబాబు ఏమన్నారు?. ”జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టే. రాష్ట్రాన్ని విడగొట్టిన ఇటలీ మాఫియా నేత సోనియాకు బుద్ది చెప్పాలి. కాంగ్రెస్‌ ను కొడవళ్లతో నరకాలి. సోనియా ఒక గాడ్సే” అంటూ నానా మాటలు మాట్లాడారు. సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి … ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు?. ”జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే” అంటున్నారు. అంటే కేంద్రంలో ఎవరిపై వ్యతిరేకత ఉంటే వారిని ప్రతిపక్షానికి అంటగట్టడం చంద్రబాబుకు అలవాటే. ఈ తరహా రాజకీయాలు చేస్తున్న […]

అడ్డంగా బాబు బుక్‌.... ట్వీట్‌ను డిలీట్ చేయడం మరిచి....
X

సరిగ్గా 2014కు ముందు చంద్రబాబు ఏమన్నారు?. ”జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టే. రాష్ట్రాన్ని విడగొట్టిన ఇటలీ మాఫియా నేత సోనియాకు బుద్ది చెప్పాలి. కాంగ్రెస్‌ ను కొడవళ్లతో నరకాలి. సోనియా ఒక గాడ్సే” అంటూ నానా మాటలు మాట్లాడారు. సరిగ్గా ఐదేళ్లు తిరిగే సరికి … ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు?. ”జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే” అంటున్నారు. అంటే కేంద్రంలో ఎవరిపై వ్యతిరేకత ఉంటే వారిని ప్రతిపక్షానికి అంటగట్టడం చంద్రబాబుకు అలవాటే.

ఈ తరహా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును…. ట్విట్టర్‌ ద్వారా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఎండగట్టారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ గురించి ఎలాంటి ట్వీట్లు చేశారన్నది కేటీఆర్‌ వెతికి బయటకి తీశారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌ గురించి చేసిన ట్వీట్‌కు సంబంధించి స్క్రీన్ షాట్స్ ను కేటీఆర్ ట్వీట్ చేశారు.

2014 ఫిబ్రవరి 15న చంద్రబాబు కాంగ్రెస్‌ను, సోనియాను దూషిస్తూ పెట్టిన ట్వీట్‌ను కేటీఆర్‌ పోస్టు చేశారు. అప్పట్లో జిల్లాల వారీగా టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన సభలు పూర్తయ్యే సరికి…. కాంగ్రెస్ పాలనకు, ఇటాలియన్ మాఫియా రాజ్ అంతమవుతుందని గతంలో చంద్రబాబు సదరు ట్వీట్‌లో వెల్లడించారు.

దాన్ని గుర్తు చేసిన కేటీఆర్‌… గతంలో ఇటాలియన్ మాఫియాకు ముగింపు పలుకుతామని చెప్పి…. ఇప్పుడు అదే ఇటాలియన్ మాఫియా రాజ్‌, చంద్రబాబు దోస్తులయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాపం చంద్రబాబు…. 2014లో తాను చేసిన ట్వీట్ ను అంత లోతుకు ఎవరు తవ్వుతారులే అనుకుని ఉండవచ్చు. ఇలా కేటీఆర్ కు దొరికిపోయాడు.

First Published:  9 Oct 2018 11:52 AM GMT
Next Story