Telugu Global
Cinema & Entertainment

మాజీ ప్రేయసితో రానా రొమాన్స్ ?

దగ్గుబాటి రానా తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా, విలన్ గా రాణిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రానా వివాదాల్లో కూడా బాగానే ఉన్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో బిపాషా బసుతో ప్రేమాయణం నడిపిన రానా తరువాత కోలీవుడ్ లో త్రిష తో ప్రేమ వ్యవహారాలు కొనసాగించాడు. ఇక ఆ తరువాత ఇద్దరు తమ రేలషన్ షిప్ కి బ్రేక్ అప్ చెప్పారు. అయితే ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే దిల్ రాజ్ తమిళ హిట్ […]

మాజీ ప్రేయసితో రానా రొమాన్స్ ?
X

దగ్గుబాటి రానా తెలుగు ఇండస్ట్రీ లో హీరోగా, విలన్ గా రాణిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రానా వివాదాల్లో కూడా బాగానే ఉన్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో బిపాషా బసుతో ప్రేమాయణం నడిపిన రానా తరువాత కోలీవుడ్ లో త్రిష తో ప్రేమ వ్యవహారాలు కొనసాగించాడు. ఇక ఆ తరువాత ఇద్దరు తమ రేలషన్ షిప్ కి బ్రేక్ అప్ చెప్పారు.

అయితే ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే దిల్ రాజ్ తమిళ హిట్ సినిమా అయిన “96” ని రీమేక్ చేద్దాం అని అనుకుంటున్నాడు. తమిళ వెర్షన్ లో హీరోయిన్ గా నటించిన త్రిషనే తెలుగులో కూడా హీరోయిన్ గా తీసుకోవాలి దిల్ రాజు భావిస్తున్నాడు. ఈ క్రమలోనే దిల్ రాజు ఈ సినిమా కోసం హీరోని కూడా వెతుకుతున్నాడు. ఇలాంటి సమయంలోనే రానా ఈ సినిమాలో నేను హీరోయిన్ గా నటిస్తాను అంటూ ముందుకి వచ్చాడు అని తెలుస్తుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది అని తెలియగానే సినిమాలో నటించడానికి ముందుకి వచ్చాడట రానా. మరి దిల్ రాజు రానా ని హీరోగా పెట్టి ఈ రీమేక్ సినిమాని తెరకేక్కిస్తాడో లేదో చూడాలి.

First Published:  9 Oct 2018 2:27 AM GMT
Next Story