Telugu Global
NEWS

సింగపూర్ కు విమానాలు నడపాల్సిందే.... నష్టం ప్రభుత్వం భరిస్తుంది

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన దేశం ఏదీ అంటే ఎవరైనా సింగపూరే అని చెబుతారు. ఎందుకంటే వీలు చిక్కినప్పుడల్లా ఆయన సింగపూర్‌ను పొడుగుతూనే ఉంటారు. వీలున్నప్పుడల్లా సింగపూర్‌లో పర్యటిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని భూములను ఇప్పటికే సింగపూర్‌ కంపెనీలకు అప్పగించేశారు. ఇప్పడే కాదు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుకు సింగపూర్‌కు మధ్య అనుబంధంపై భారీ కథనాలే వచ్చాయి. అలాంటి సింగపూర్‌కు తానుంటున్న అమరావతి నుంచే నేరుగా విమానం ఉంటే ఇంకెంత బాగుంటుందో అని ఇటీవల […]

సింగపూర్ కు విమానాలు నడపాల్సిందే.... నష్టం ప్రభుత్వం భరిస్తుంది
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన దేశం ఏదీ అంటే ఎవరైనా సింగపూరే అని చెబుతారు. ఎందుకంటే వీలు చిక్కినప్పుడల్లా ఆయన సింగపూర్‌ను పొడుగుతూనే ఉంటారు. వీలున్నప్పుడల్లా సింగపూర్‌లో పర్యటిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని భూములను ఇప్పటికే సింగపూర్‌ కంపెనీలకు అప్పగించేశారు.

ఇప్పడే కాదు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుకు సింగపూర్‌కు మధ్య అనుబంధంపై భారీ కథనాలే వచ్చాయి. అలాంటి సింగపూర్‌కు తానుంటున్న అమరావతి నుంచే నేరుగా విమానం ఉంటే ఇంకెంత బాగుంటుందో అని ఇటీవల చంద్రబాబు కలలు కన్నారు. అందుకు తగ్గట్టే సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. అశోక్‌ గజపతిరాజు విమానయానశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు వేగంగా సాగాయి.

అయితే ఇటీవల పరిస్థితి మారిపోయాయి. విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసుల వల్ల లాభం ఉండదని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ సర్వీసులు నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా లేవని తేల్చేసింది. ఈవిషయం తెలుసుకున్న చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కస్టమ్స్‌, ఎయిర్ ఫోర్ట్స్ అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈనెల 25 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా విజయవాడ నుంచి సింగపూర్‌కు విమానాలు తిప్పాల్సిందేనని స్పష్టం చేశారు.

ప్రయాణికుల రద్దీ ఉండదు కాబట్టి విజయవాడ-సింగపూర్‌కు సర్వీస్ నడిపితే విమానయాన సంస్థలకు కోట్లాది రూపాయలు నష్టం రానుంది. ఈ నేపథ్యంలో వయబులిటీ గ్యాప్ కింద రూ. 18 కోట్లు చెల్లిస్తామని చంద్రబాబు చెప్పారు. నష్టం తాము భరిస్తామని విమాన సర్వీసు మాత్రం నడవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై కేంద్రానికి లేఖ కూడా రాస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు.

అయితే నష్టం వస్తుందని తెలిసినా, ప్రయాణికులు ఉండరని తెలిసినా చంద్రబాబు ఎందుకు ఇలా విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసు ఉండాలని పట్టుపడుతున్నారో అర్థం కావడం లేదని అధికారులు వాపోతున్నారు.

First Published:  8 Oct 2018 11:35 PM GMT
Next Story