Telugu Global
NEWS

అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో డీకే అరుణ పిటీషన్

డీకే అరుణ భారీ స్కెచ్ వేసింది. మొన్నీ మధ్యే వనపర్తి సభలో కేసీఆర్ తిట్టిన టిట్లకే నిన్న కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ప్రయత్నాలకు అడ్డు తగిలేలా… గట్టి షాక్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నారని…. ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాలు తీసుకోలేదని…. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని…. ఈ అసెంబ్లీ రద్దును విరమించి ఎన్నికలను వాయిదా వేయాలని డీకే అరుణ హైకోర్టులో పిటీషన్ వేశారు. డీకే అరుణ అసెంబ్లీ రద్దుపై వేసిన […]

అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో డీకే అరుణ పిటీషన్
X

డీకే అరుణ భారీ స్కెచ్ వేసింది. మొన్నీ మధ్యే వనపర్తి సభలో కేసీఆర్ తిట్టిన టిట్లకే నిన్న కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ప్రయత్నాలకు అడ్డు తగిలేలా… గట్టి షాక్ ఇచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నారని…. ఎమ్మెల్యేల అందరి అభిప్రాయాలు తీసుకోలేదని…. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని…. ఈ అసెంబ్లీ రద్దును విరమించి ఎన్నికలను వాయిదా వేయాలని డీకే అరుణ హైకోర్టులో పిటీషన్ వేశారు.

డీకే అరుణ అసెంబ్లీ రద్దుపై వేసిన పిటీషన్ ను ఉమ్మడి హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో దీనిపై ఏం నిర్ణయం వెలువరిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.

పిటీషన్ వేసిన అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడింది. అసెంబ్లీ రద్దుకు ముందు శాసనసభను సమావేశపరిచి సభ్యులందరి అభిప్రాయాలు తీసుకోవాలని.. కానీ కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇలా నిరంకుశంగా అసెంబ్లీని రద్దు చేయడం కుదరదని.. గవర్నర్ కూడా అసెంబ్లీ రద్దు సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాదనను పరిగణనలోకి తీసుకోలేదని ధ్వజమెత్తారు.

శాసనసభను సమావేశపరచమని గవర్నర్ కూడా కోరలేదని తెలిపారు. ఈ అనైతిక అసెంబ్లీ రద్దుపై సుప్రీంలో ఇదివరకే పిటీషన్ దాఖలైతే హైకోర్టులో వేయమని సూచించారని… అందుకే హైకోర్టులో ఈరోజు మధ్యాహ్నం పిటీషన్ వేశామని డీకే అరుణ చెప్పారు.

కాగా డీకే అరుణ పిటీషన్ పై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల్లో పోటీచేస్తే ఓడిపోతామనే కాంగ్రెస్ నేతలు ఇలా హైకోర్టు ద్వారా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

కాగా ఇప్పటికే తెలంగాణ ఓటర్ల జాబితాపై పలు పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఓటర్ల జాబితాపై పిటీషన్ వేసిన వారిలో కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా ఉన్నారు. ఓటర్ల జాబితాపై ఈసీ ఈరోజు కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. అనంతరం హైకోర్టు ఈ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇప్పుడు అసెంబ్లీ రద్దు నిర్ణయంపై పిటీషన్ వేయడంతో తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముందుకు సాగుతాయా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

First Published:  8 Oct 2018 5:37 AM GMT
Next Story