Telugu Global
Cinema & Entertainment

స్టూడియో రౌండప్

ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రేపల్లెలో జరుగుతోంది. తెల్లటి దుస్తులు ధరించి ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య రిక్షా తొక్కుతున్న సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ షెడ్యూల్ తర్వాత యూనిట్ రాజమండ్రికి షిఫ్ట్ అవుతుంది. మహర్షి మహేష్ బాబు-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. మహేష్ ఇప్పటికే అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ […]

స్టూడియో రౌండప్
X

ఎన్టీఆర్

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రేపల్లెలో జరుగుతోంది. తెల్లటి దుస్తులు ధరించి ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య రిక్షా తొక్కుతున్న సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ షెడ్యూల్ తర్వాత యూనిట్ రాజమండ్రికి షిఫ్ట్ అవుతుంది.

మహర్షి

మహేష్ బాబు-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. మహేష్ ఇప్పటికే అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీని తర్వాత రామోజీ ఫిలింసిటీలో మరో షెడ్యూల్ ఉంటుంది.

ప్రభాస్ కొత్త సినిమా

రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు ప్రభాస్ కొబ్బరికాయ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటలీలో ప్రారంభమైంది. ప్రస్తుతం హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే మధ్య కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. 1970ల నాటి ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ మీసాలు తీసేసి, సరికొత్త గెటప్ లోకి మారాడు.

హలో గురు ప్రేమకోసమే

రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టాకీ పూర్తిచేసుకుంది. చివరి పాటను ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో తీస్తున్నారు. సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రినాధరావు నక్కిన డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఈనెల 18న రిలీజ్ చేయబోతున్నారు.

సైరా

చిరంజీవి 151వ చిత్రం సైరా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. చిరంజీవిపై కొన్ని యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరో 3 వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. జార్జియా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో నెక్ట్స్ షెడ్యూల్ ఉంటుంది.

చరణ్-బోయపాటి చిత్రం

ప్రస్తుతం అజర్ బైజాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. చరణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వివేక్ ఒబరాయ్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకు వినయ విధేయ రామ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

First Published:  8 Oct 2018 7:50 AM GMT
Next Story