Telugu Global
NEWS

మ‌ళ్లీ రుణ‌మాఫీనే దిక్కు అంటున్న కేసీఆర్ !

తెలంగాణ ఎన్నిక‌ల‌కు తిప్పికొడితే 58 రోజుల టైముంది. మ‌హాకూట‌మి సీట్ల లెక్క తేలలేదు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా బ‌య‌ట‌కు రాలేదు. టీఆర్ఎస్ క్యాండేట్ల‌ను ప్ర‌క‌టించింది. ఇంకా 14 మాత్ర‌మే పెండింగ్‌లో పెట్టారు. ఇప్ప‌టికే నాలుగు స‌భ‌ల‌కు కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల ర‌ణం ఎలా ఉండ‌బోతుందో శాంపిల్ చూపించారు. కాంగ్రెస్‌ను సైడ్‌లైన్ చేసి… చంద్ర‌బాబుకు త‌నకు మ‌ధ్య‌ వార్ చిత్రీక‌ర‌ణ మొద‌లెట్టారు. మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిలించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ఎస్ అందరికంటే ముందుంది. కానీ […]

మ‌ళ్లీ రుణ‌మాఫీనే దిక్కు అంటున్న కేసీఆర్ !
X

తెలంగాణ ఎన్నిక‌ల‌కు తిప్పికొడితే 58 రోజుల టైముంది. మ‌హాకూట‌మి సీట్ల లెక్క తేలలేదు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా బ‌య‌ట‌కు రాలేదు. టీఆర్ఎస్ క్యాండేట్ల‌ను ప్ర‌క‌టించింది. ఇంకా 14 మాత్ర‌మే పెండింగ్‌లో పెట్టారు. ఇప్ప‌టికే నాలుగు స‌భ‌ల‌కు కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల ర‌ణం ఎలా ఉండ‌బోతుందో శాంపిల్ చూపించారు. కాంగ్రెస్‌ను సైడ్‌లైన్ చేసి… చంద్ర‌బాబుకు త‌నకు మ‌ధ్య‌ వార్ చిత్రీక‌ర‌ణ మొద‌లెట్టారు. మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిలించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ఎస్ అందరికంటే ముందుంది. కానీ కేసీఆర్ కు ఎప్ప‌టిక‌ప్పుడు వ‌స్తున్న గ్రౌండ్ రిపోర్టు మాత్రం తేడాగా క‌నిపిస్తోంది. కేసీఆర్ 110 గెలుస్తున్నామ‌ని బ‌య‌ట‌కు చెబుతున్నారు. బ‌హిరంగ‌స‌భ‌ల్లో ఆర్బాటంగా ప్ర‌క‌టిస్తున్నారు. కానీ స‌ర్వేల్లో మాత్రం ఆ రిజ‌ల్ట్ క‌నిపించ‌డం లేద‌ట‌. జ‌నం ఎందుకో ఇంకా టీఆర్ఎస్ కు ఓటు వేయాల‌ని డిసైడ్ కాలేద‌ని తెలుస్తోంద‌ట‌.

ఈ స‌ర్వే ఫ‌లితాలు, గ్రౌండ్ నుంచి వ‌స్తున్న నిఘా వ‌ర్గాల స‌మాచారం చూస్తుంటే… ముందు ముందు కేసీఆర్ మ‌రిన్ని వ‌రాలు కురిపించే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌క‌టించిన రెండు వేల పెన్ష‌న్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని కేసీఆర్ ప‌సిగ‌ట్టారు. అందుకే తాను పెంచే ఉద్దేశం ఉంద‌ని రెండు బ‌హిరంగ‌స‌భ‌ల్లో ప్ర‌క‌టించారు. న‌ల్గొండ‌లో అయితే పెన్ష‌న్ పెంచమంటారా? అని స‌భికుల‌ను ప్ర‌శ్నించారు. పెంచాల‌ని వారి నుంచి మంచి స్పందన వ‌చ్చింది. దీంతో పెన్ష‌న్ పెంపుపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే మేనిఫెస్టోలో పెడ‌తామ‌ని చెప్పారు.

పెన్ష‌న్ ఒక్క‌టే కాదు. కాంగ్రెస్‌ చెబుతున్న రెండు లక్షల రుణమాఫీ పై రైతుల్లో పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ట్లు కేసీఆర్ ప‌సిగ‌ట్టారు. దీంతో తాను ల‌క్ష రూపాయల రుణ‌మాఫీని ఏకకాలంలో చేయ‌బోతున్న‌ట్లు కేసీఆర్ త్వ‌ర‌లో ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. రెండు మూడు రోజుల్లో ప్ర‌క‌టించే టీఆర్ఎస్ మేనిఫెస్ట్‌లో మ‌రిన్ని వ‌రాలు ఇస్తార‌ని తెలుస్తోంది.

అయితే గెలుపు ఆశ‌లు రోజురోజుకు స‌న్న‌గిల్లుతున్న కేసీఆర్‌… ఇలాంటి వ‌రాలు మ‌ళ్లీ తెర‌పైకి తెస్తున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ రెండోసారి ఎలాంటి ప్ర‌త్యేక‌ హామీలు ఇవ్వ‌కుండానే అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తిని గుర్తు పెట్టుకోవాల‌ని అంటున్నారు.

అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తాను అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌పై న‌మ్మ‌కంతోనే విజ‌యం సాధించార‌ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ కేసీఆర్ 400 సంక్షేమ ప‌థ‌కాలు తీసుకొచ్చాన‌ని ప్రచారం చేసుకుంటున్నా….. జ‌నం ఇంకా న‌మ్మ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

First Published:  7 Oct 2018 7:55 PM GMT
Next Story