Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “సాహో” షూటింగ్ పూర్తీ కాకముందే మరో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసాడు. రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది. అక్కడ హీరోయిన్ పూజ హెగ్డే కి ఇంకా ప్రభాస్ కి మధ్యలో కొన్ని లవ్ సీన్స్ ని షూట్ చేస్తున్నాడు దర్శకుడు. పూర్తీ స్థాయి లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అనుకున్నారు […]

ప్రభాస్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
X

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “సాహో” షూటింగ్ పూర్తీ కాకముందే మరో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసాడు. రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది. అక్కడ హీరోయిన్ పూజ హెగ్డే కి ఇంకా ప్రభాస్ కి మధ్యలో కొన్ని లవ్ సీన్స్ ని షూట్ చేస్తున్నాడు దర్శకుడు.

పూర్తీ స్థాయి లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అనుకున్నారు మూవీ యూనిట్. “అమౌర్” అని అనుకున్న ఈ టైటిల్ ని ఫ్రెంచ్ బాషలో చూస్తే ప్రేమ అనే అర్ధం వచ్చేలా ఉంటుందట. సినిమా మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఈ టైటిల్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారు.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. యువి క్రియేషన్స్ వారు గోపి కృష్ణ మూవీస్ వారు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ధియేటర్స్ లో సందడి చేయనుంది.

First Published:  8 Oct 2018 2:32 AM GMT
Next Story