Telugu Global
Cinema & Entertainment

"అరవింద సమేత" లో అరగంట వరకు మాటలు లేవట

ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత” సినిమా పై ఇప్పుడు అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే తోలి సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి డైలాగ్స్ రాసాడు అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు “అరవింద సమేత” గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో తోలి అరగంట ఎన్టీఆర్ కు మాటలు ఉండవని… మరీ అవసరం అయినప్పుడు మాత్రమే నోరు తెరుస్తాడని చెప్పాడు త్రివిక్రమ్ […]

అరవింద సమేత లో అరగంట వరకు మాటలు లేవట
X

ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత” సినిమా పై ఇప్పుడు అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే తోలి సారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి డైలాగ్స్ రాసాడు అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు “అరవింద సమేత” గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో తోలి అరగంట ఎన్టీఆర్ కు మాటలు ఉండవని… మరీ అవసరం అయినప్పుడు మాత్రమే నోరు తెరుస్తాడని చెప్పాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఆ విధంగా డిజైన్ చేసాము అందుకే ఎన్టీఆర్ అరగంట సేపు ఎక్కువుగా మాట్లాడాడు అని తెలిపాడు త్రివిక్రమ్.

అసలు ఎన్టీఆర్ లాంటి హీరోను తోలి అరగంట డైలాగ్స్ లేకుండా ఉంచడం అంటే మాములు విషయం కాదు. కానీ ఆ సాహసాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్నాడు. మరి ఇది రేపు ధియేటర్స్ లో ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 11 న రిలీజ్ కాబోతుంది.

First Published:  7 Oct 2018 11:48 PM GMT
Next Story