Telugu Global
Cinema & Entertainment

నోటా మొదటి రోజు హిట్

నోటా సినిమా మొదటి రోజు హిట్ అయింది. ఇక్కడ “మొదటి రోజు హిట్” అనే అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటిరోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. కానీ హైప్ కారణంగా తొలిరోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అందుకే నోటాను మొదటి రోజు హిట్ అని చెప్పాం. ఈ సినిమా అసలు స్వరూపం తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఇక ఫస్ట్ డే కలెక్షన్ విషయానికొస్తే నోటాకు మొదటి రోజు అన్ని ఏరియాస్ […]

నోటా మొదటి రోజు హిట్
X

నోటా సినిమా మొదటి రోజు హిట్ అయింది. ఇక్కడ “మొదటి రోజు హిట్” అనే అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటిరోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. కానీ హైప్ కారణంగా తొలిరోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. అందుకే నోటాను మొదటి రోజు హిట్ అని చెప్పాం. ఈ సినిమా అసలు స్వరూపం తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే.

ఇక ఫస్ట్ డే కలెక్షన్ విషయానికొస్తే నోటాకు మొదటి రోజు అన్ని ఏరియాస్ నుంచి మంచి వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 7 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ రాబట్టింది ఈ సినిమా. ఇంకా చెప్పాలంటే నాగ్-నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా తొలి రోజు సాధించిన వసూళ్లు కంటే ఇది ఎక్కువే.

అలా మొదటిరోజు తన స్టామినా ఏంటో చూపించిన దేవరకొండ.. ఈ వీకెండ్ గడిస్తే సినిమాను ఎలా ముందుకు నడిపిస్తాడనేది అందర్లో డౌట్. ఇప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వచ్చే వీకెండ్ వరకు కొనసాగడం కష్టమే అంటోంది ట్రేడ్. ఇక ఏపీ, నైజాంలో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.95 కోట్లు
సీడెడ్ – రూ. 0.62 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.51 కోట్లు
ఈస్ట్ – రూ. 0.34 కోట్లు
వెస్ట్ – రూ. 0.23 కోట్లు
గుంటూరు – రూ. 0.42 కోట్లు
కృష్ణా – రూ. 0.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.21 కోట్లు

First Published:  6 Oct 2018 10:10 PM GMT
Next Story