Telugu Global
NEWS

కులతత్వంలో ప్రపంచ కీర్తినార్జించిన కుటిల నేత చంద్రబాబు

చంద్రబాబు కుల పాలన సాగిస్తున్నారని సామాజిక వేత్త కత్తి పద్మారావు విమర్శించారు. కులతత్వంలో ప్రపంచ కీర్తినార్జించిన కుటిల నేత చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కులం కోసమే బతికే అంకితభావం చంద్రబాబుకు మాత్రమే సొంతమన్నారు. తన కులం కాని మంత్రుల వైపు కన్నెత్తి కూడా చూడలేనంత అసహనం చంద్రబాబులో ఉందన్నారు. విదేశాలకు వెళ్లినా చంద్రబాబు, నారా లోకేష్‌లు తమ కులం వారిని మాత్రమే కలుస్తారని విమర్శించారు. విదేశాల్లోని తన కులం వారి డేటాను సేకరించి మరీ లోకేష్ కలుస్తున్నారని […]

కులతత్వంలో ప్రపంచ కీర్తినార్జించిన కుటిల నేత చంద్రబాబు
X

చంద్రబాబు కుల పాలన సాగిస్తున్నారని సామాజిక వేత్త కత్తి పద్మారావు విమర్శించారు. కులతత్వంలో ప్రపంచ కీర్తినార్జించిన కుటిల నేత చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కులం కోసమే బతికే అంకితభావం చంద్రబాబుకు మాత్రమే సొంతమన్నారు.

తన కులం కాని మంత్రుల వైపు కన్నెత్తి కూడా చూడలేనంత అసహనం చంద్రబాబులో ఉందన్నారు. విదేశాలకు వెళ్లినా చంద్రబాబు, నారా లోకేష్‌లు తమ కులం వారిని మాత్రమే కలుస్తారని విమర్శించారు. విదేశాల్లోని తన కులం వారి డేటాను సేకరించి మరీ లోకేష్ కలుస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగో ఓటమి తప్పదని తెలిసి పార్టీ ఫండ్ పేరుతో విదేశాల్లో ఉన్న తన కులం వారి వద్ద కూడా వందల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు ప్రస్తుతం కుల, పుత్రవ్యామోహంలో ఉన్నారని…. అది సొంత పార్టీ నేతలకే వెగటు పుట్టించే స్థాయికి చేరిందన్నారు. చంద్రబాబు అవినీతి విశ్వరూపం కాగ్ రిపోర్టును చూస్తే తెలుస్తుందన్నారు. వ్యవసాయానికి వ్యతిరేకి చంద్రబాబు అని.. ఆయన హయాంలో రెండు కోట్ల ఎకరాలను ఎండబెట్టారని మండిపడ్డారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది మద్యాన్ని ఏరులై పారించడంలో మాత్రమేనని కత్తి పద్మారావు విమర్శించారు. చంద్రబాబు రాజ్యాధికారాన్ని కుల, పుత్ర, కుటుంబ అనువంశికంగా మార్చేస్తున్నారని కత్తి పద్మారావు ధ్వజమెత్తారు.

First Published:  7 Oct 2018 6:09 AM GMT
Next Story