Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ లో మరో కాస్టింగ్ కౌచ్

ఇప్పుడు ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ ఉదంతాలే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు కనిపించడం లేదు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా హీరోయిన్లు, మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు జరిగిన చేదు అనుభవాల్ని బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ కంగనా రనౌత్ కూడా మరో ఉదంతాన్ని బయటపెట్టింది. క్వీన్ అనే సూపర్ హిట్ సినిమాతో కంగనాను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేశాడు దర్శకుడు వికాస్ బాల్. ఇప్పుడు సరాసరి అతడిపైనే కాస్టింగ్ […]

బాలీవుడ్ లో మరో కాస్టింగ్ కౌచ్
X

ఇప్పుడు ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ ఉదంతాలే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు కనిపించడం లేదు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా హీరోయిన్లు, మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు జరిగిన చేదు అనుభవాల్ని బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ కంగనా రనౌత్ కూడా మరో ఉదంతాన్ని బయటపెట్టింది.

క్వీన్ అనే సూపర్ హిట్ సినిమాతో కంగనాను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేశాడు దర్శకుడు వికాస్ బాల్. ఇప్పుడు సరాసరి అతడిపైనే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంధించింది కంగన. ప్రతి రోజు చీకటి పడగానే ఓ మహిళను కోరుకుంటాడంటూ వికాస్ పై విరుచుకుపడింది. అంతేకాకుండా, ఎన్నో సందర్భాల్లో తనను కూడా ఏడిపించాడని చెప్పుకొచ్చింది.

వికాస్ కు తను అంత ఛాన్స్ ఇవ్వలేదని, దీంతో పబ్లిక్ ఫంక్షన్లలో పలకరించే సాకుతో తనను గట్టిగా కౌగిలించుకోనేవాడని వికాస్ పై విమర్శలు చేసింది కంగన. లేట్ నైట్ పార్టీలకు రమ్మని తనను బలవంతం చేసేవాడని, తను మాత్రం తొందరగా పడుకునేదాన్నని చెప్పుకొచ్చింది. మర్నాడు పొద్దున్నే తనను అనరాని మాటలు అనేవాడని తెలిపింది.

బాంబే వాల్వెట్ అనే సినిమా ప్రచారం టైమ్ లో యూనిట్ కు చెందిన ఓ మహిళను వికాస్, లైంగికంగా వేధించాడు. ఇన్నాళ్లకు ఆ మహిళ అప్పటి కాస్టింగ్ కౌచ్ ఘటనను బయటపెట్టింది. ఆమెకు పూర్తి మద్దతు తెలిపిన కంగనా, ఇలా వికాస్ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది.

First Published:  7 Oct 2018 10:42 AM GMT
Next Story