Telugu Global
NEWS

సోమ కుమారుడికి పదవి.... కిడారి ఇంటి వద్ద భద్రత పెంపు

ఇటీవల మావోయిస్టుల దాడిలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు అబ్రహంకు రాష్ట్ర ప్రభుత్వం పదవి ఇవ్వబోతోంది. అబ్రహంను ఎస్సీఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించబోతున్నారు.  ఇందు కోసం ఇప్పటికే బయోడేటాను పంపించాల్సిందిగా అబ్రహంను సీఎంవో అధికారులు కోరారు.  సివేరి సోమ… ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఉంటూనే హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పదవిని ఆయన కుమారుడికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తన తండ్రి నిర్వహించిన పదవిని ఇస్తే గిరిజనులకు సేవ చేసుకుంటానని అబ్రహం తెలిపారు. […]

సోమ కుమారుడికి పదవి.... కిడారి ఇంటి వద్ద భద్రత పెంపు
X

ఇటీవల మావోయిస్టుల దాడిలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు అబ్రహంకు రాష్ట్ర ప్రభుత్వం పదవి ఇవ్వబోతోంది. అబ్రహంను ఎస్సీఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించబోతున్నారు. ఇందు కోసం ఇప్పటికే బయోడేటాను పంపించాల్సిందిగా అబ్రహంను సీఎంవో అధికారులు కోరారు.

సివేరి సోమ… ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఉంటూనే హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పదవిని ఆయన కుమారుడికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తన తండ్రి నిర్వహించిన పదవిని ఇస్తే గిరిజనులకు సేవ చేసుకుంటానని అబ్రహం తెలిపారు. సీఎం ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్దమన్నారు.

అటు హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కిడారి పెద్దకుమారుడు శ్రావణ్‌ కుమార్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పించేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ముందుస్తు చర్యల్లో బాగంగా కిడారి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇప్పటికే ఉన్న భద్రతకు అదనంగా మరో ఐదుగురు సెంట్రీలను ఇంటి వద్ద ఏర్పాటు చేశారు. అటు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఆమె ఇంటి వద్ద కూడా భద్రత పెంచారు.

First Published:  7 Oct 2018 12:14 AM GMT
Next Story