Telugu Global
NEWS

బాల్క సుమ‌న్‌కి కొత్త సెగ !

టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్‌కు అసెంబ్లీలో అడుగుపెట్టాల‌నేది ఆయ‌న క‌ల‌. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఆయ‌న బాస్ కేటీఆర్‌… చెన్నూరు టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదెలును ప‌క్క‌న‌పెట్టి మ‌రీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో చెన్నూరులో అస‌మ్మ‌తి చిచ్చు రేగింది. సుమ‌న్ ప్ర‌చారం ప్రారంభించిన రోజే ఓదెలు అభిమాని గ‌ట్ట‌య్య అనే కార్య‌క‌ర్త పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇక్క‌డ సుమ‌న్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. టిక్కెట్ కోసం ఓ మ‌నిషిని పొట్ట‌న‌బెట్టుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. సుమ‌న్‌ను మార్చాల‌ని […]

బాల్క సుమ‌న్‌కి కొత్త సెగ !
X

టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమ‌న్‌కు అసెంబ్లీలో అడుగుపెట్టాల‌నేది ఆయ‌న క‌ల‌. అందుకు త‌గ్గ‌ట్లుగానే ఆయ‌న బాస్ కేటీఆర్‌… చెన్నూరు టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఓదెలును ప‌క్క‌న‌పెట్టి మ‌రీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో చెన్నూరులో అస‌మ్మ‌తి చిచ్చు రేగింది. సుమ‌న్ ప్ర‌చారం ప్రారంభించిన రోజే ఓదెలు అభిమాని గ‌ట్ట‌య్య అనే కార్య‌క‌ర్త పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఇక్క‌డ సుమ‌న్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. టిక్కెట్ కోసం ఓ మ‌నిషిని పొట్ట‌న‌బెట్టుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

సుమ‌న్‌ను మార్చాల‌ని న‌ల్లాల ఓదెలు ప‌ట్టుబ‌ట్టాడు. దీంతో హైద‌రాబాద్‌కు పిలిచి కేసీఆర్ ఆయ‌న‌తో మాట్లాడారు. కేసీఆర్ ఏం హామీ ఇచ్చారో తెలియ‌దు. కానీ ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి రాగానే ఓదెలు మెత్త‌బ‌డ్డాడు. సుమ‌న్‌ను గెలిపిస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు ఓదెలు సైలెంట్ అయిపోయాడు. కానీ ఇంకో నేత మాత్రం సుమ‌న్‌కు టిక్కెట్ ఇవ్వొద్ద‌ని మెలిక‌పెట్టాడు. ఆయ‌నే పెద్ద‌ప‌ల్లి మాజీ ఎంపీ వివేక్‌. త‌న సోద‌రుడు వినోద్‌కు చెన్నూరు టికెట్ ఇవ్వాల‌ని ఆయన గులాబీ హైక‌మాండ్ ద‌గ్గ‌ర ప్ర‌పోజ‌ల్ పెట్టాడ‌ట‌. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కార్యక‌ర్తలు కూడా వినోద్‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని కోరార‌ట‌.

ఈ వ్య‌వ‌హారం కేటీఆర్ ద‌గ్గ‌ర‌కు చేర‌డంతో చెన్నూరు అభ్య‌ర్థి సుమ‌న్‌ను మార్చేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే సుమన్ గెలుపు కోసం తాము పనిచేయలేమని వివేక్‌ అనుచరులు అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. తమ దారి తాము చూసుకుంటామని కూడా చెన్నూరు నాయకులు వివేక్‌కు తెలియజేశారని సమాచారం. ఓదెలు తో సమస్య పరిష్కారమైందనుకుంటే కొత్తగా వివేక్ అనుచరుల రూపంలో అసమ్మతి బయలుదేరింది. దీంతో బాల్క సుమన్‌కు చిక్కులు తప్పేలా లేవని అర్ధమవుతున్నది. దీంతో చెన్నూరులో సుమ‌న్‌కు అస‌మ్మ‌తి సెగ ఓ రేంజ్‌లో త‌గులుతుంద‌ని చెప్పుకోవ‌చ్చు.

First Published:  7 Oct 2018 12:10 AM GMT
Next Story