Telugu Global
NEWS

మ‌హాకూట‌మిలో సీపీఐ కోరుతున్న సీట్లు ఇవే !

మ‌హాకూట‌మి పేరు ఇంకా ఖ‌రారు కాలేదు. కూట‌మి పేరు ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని మొన్న‌నే కోదండ‌రాం కుండ‌బ‌ద్ద‌లు కొట్లారు. ఇటు కూట‌మి పేరు, ఎజెండా, సీట్లపై ఇంకా స్ప‌ష్టత రాలేదు. అయితే సీపీఐ తాము కోరుతున్న సీట్ల లిస్ట్ మాత్రం విడుద‌ల చేసింది. 11 సీట్లు ఇవ్వాల‌ని కూట‌మికి అధికారికంగా ఓ లిస్ట్ అందించింది. సీపీఐ కోరుతున్న సీట్లు ఇవే…. 1. కొత్త‌గూడెం 2. వైరా 3. హుస్నాబాద్‌ 4. బెల్లంప‌ల్లి 5. ఆలేరు 6. మునుగోడు 7. […]

మ‌హాకూట‌మిలో సీపీఐ కోరుతున్న సీట్లు ఇవే !
X

మ‌హాకూట‌మి పేరు ఇంకా ఖ‌రారు కాలేదు. కూట‌మి పేరు ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని మొన్న‌నే కోదండ‌రాం కుండ‌బ‌ద్ద‌లు కొట్లారు. ఇటు కూట‌మి పేరు, ఎజెండా, సీట్లపై ఇంకా స్ప‌ష్టత రాలేదు. అయితే సీపీఐ తాము కోరుతున్న సీట్ల లిస్ట్ మాత్రం విడుద‌ల చేసింది. 11 సీట్లు ఇవ్వాల‌ని కూట‌మికి అధికారికంగా ఓ లిస్ట్ అందించింది.

సీపీఐ కోరుతున్న సీట్లు ఇవే….

1. కొత్త‌గూడెం
2. వైరా
3. హుస్నాబాద్‌
4. బెల్లంప‌ల్లి
5. ఆలేరు
6. మునుగోడు
7. పిన‌పాక‌
8. దేవ‌ర‌కొండ‌
9. మంచిర్యాల‌
10. కుత్బల్లాపూర్ లేదా మ‌ల్కాజిగిరి
11. భూపాల‌ప‌ల్లి లేదా మ‌హ‌బూబాబాద్

ఈ లిస్ట్ ప్ర‌కారం చూస్తే 2014లో సీపీఐకి ఇచ్చిన సీట్ల‌నే కాంగ్రెస్ ఇవ్వొచ్చ‌ని అభిప్రాయం క‌లుగుతోంది. దేవ‌ర‌కొండ‌లో సీపీఐ సిట్టింగ్ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లో చేరారు. దీని ప్ర‌కారం సీపీఐకి మ‌ళ్లీ ఈ సీటు ఇవ్వొచ్చు. కొత్త‌గూడెంలో గ‌త ఎన్నిక‌ల్లో సీపీఐ నాలుగోస్థానానికి ప‌డిపోయింది.

దీంతో ఈ సీటు ఇవ్వొద్ద‌ని కాంగ్రెస్ నేత‌లు పోరుపెడుతున్నారు. వైరా సీటు విష‌యంలో కూడా ఇదే లాజిక్‌ను కాంగ్రెస్ నేత‌లు తెర‌పైకి వ‌చ్చారు. హుస్నాబాద్ సీటును గ‌త పొత్తు టైమ్‌లోనే కాంగ్రెస్ ఇవ్వ‌లేదు. ఇక్క‌డ కాంగ్రెస్ నేత ప్ర‌వీణ్‌రెడ్డి స్ట్రాంగ్‌. సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డి కంటే ప్ర‌వీణ్‌రెడ్డికే ఇక్క‌డ ఎక్కువ బ‌లం, బ‌లగం ఉంది. ఇప్ప‌టికే ప్ర‌వీణ్‌రెడ్డి కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారం మొదలుపెట్టారు.

ఇక న‌ల్గొండ‌లో ఆలేరు సీటు ఇచ్చే ప‌రిస్థితి లేదు. మునుగోడు విష‌యంలో కొంచెం కాంగ్రెస్ మెత‌క‌వైఖ‌రి తీసుకోవ‌చ్చు. ఎందుకంటే ఇక్క‌డ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి సీటు ఆశిస్తున్నారు. పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కూతురు కూడా పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. దీంతో మ‌ధ్యేమార్గం సీటు సీపీఐకి తీస్తే స‌మ‌స్య తీరిపోతుంద‌ని కాంగ్రెస్ నేతలు భావిస్తే…. మునుగోడు సీటు సీపీఐకి ద‌క్కే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

బెల్లంప‌ల్లిలో పొత్తులో భాగంగా ఇక్క‌డ సీపీఐ గతంలో గెలిచింది. ఈ సీటు ఇస్తే ఇవ్వొచ్చు. పిన‌పాక త‌ప్పిస్తే….మిగ‌తా సీట్ల‌లో కాంగ్రెస్ నేత‌లే బలంగా ఉన్నారు. దీంతో వాటిని వ‌దులుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మొత్తానికి మ‌హాకూట‌మిలో సీట్ల సర్దుబాటు చాలా కాలం ప‌ట్టే అవ‌కాశాలే క‌న్పిస్తున్నాయి.

First Published:  5 Oct 2018 10:53 PM GMT
Next Story