Telugu Global
NEWS

కాంగ్రెస్ జాతకం మాయావతి మీదే ఆధాపడిందా?

అటు రాజస్థాన్, ఇటు మధ్య ప్రదేశ్ ఎన్నికలు…. వీటితో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికలు.. వీటన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ జాతకం ఒకే ఒక వ్యక్తి మీద ఆధారపడినట్టుగా తెలుస్తోంది. ఆమె తీసుకునే నిర్ణయాన్ని బట్టి…. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఛాన్సులుంటాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె మరెవరో కాదు… మాయావతి. బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనే మాయవతి పాత్ర గురించి జాతీయ మీడియా వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఆమెతో […]

కాంగ్రెస్ జాతకం మాయావతి మీదే ఆధాపడిందా?
X

అటు రాజస్థాన్, ఇటు మధ్య ప్రదేశ్ ఎన్నికలు…. వీటితో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికలు.. వీటన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ జాతకం ఒకే ఒక వ్యక్తి మీద ఆధారపడినట్టుగా తెలుస్తోంది. ఆమె తీసుకునే నిర్ణయాన్ని బట్టి…. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఛాన్సులుంటాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె మరెవరో కాదు… మాయావతి. బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనే మాయవతి పాత్ర గురించి జాతీయ మీడియా వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

ఆమెతో పొత్తుతో వెళితే కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు పొందుతుందని, ఆమెతో పొత్తుతో వెళ్లకపోతే.. ఆమె సొంతంగా పోటీ చేస్తే కాంగ్రెస్ కు దెబ్బేనని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాయ చీల్చడం సంగతెలా ఉన్నా దళిత ఓటును మాత్రం గట్టిగా చీలుస్తుందని దీంతో కాంగ్రెస్ కు దెబ్బ పడుతుందని అంటున్నారు.

కేవలం మధ్యప్రదేశ్ లోనే కాదు.. ఉత్తరభారతదేశంలోని మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా మాయ ప్రభావం ఉంటుందనే అంచనాలున్నాయి.

ఇక యూపీలో అయితే రేపటి ఎన్నికల ఫలితాలను తేల్చేది పొత్తులే అని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్, ఎస్పీలతో కలిసి బీఎస్పీ పోటీ చేస్తే బీజేపీకి దెబ్బ పడే అవకాశాలున్నాయి. అలా కాకుండా.. బీఎస్పీ వేరేగా పోటీ చేస్తే బీజేపీకి చాలా మేలు జరుగుతుందనే అభిప్రాయాలున్నాయి.

కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీల మధ్యన పొత్తు కుదిరే సఖ్యతను బట్టే యూపీలో ఎంపీ సీట్ల లెక్క తేలుతుందనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో మాయ ఏం చేస్తుంది? అనేది కీలకమైన అంశం.

అయితే ఆమె పొత్తులకు ఓకే అంటోంది.. కానీ, తను కోరినన్ని సీట్లు కావాలని అంటోంది. ఒకవేళ తను కోరినన్ని సీట్లను ఇవ్వకపోతే ఆమె పొత్తులకు నో అని చెబుతోంది. నిర్మొహమాటంగా వ్యవహరిస్తోంది. రేపు యూపీ లో కూడా మాయ పొత్తులకు నో అంటే.. దెబ్బ పడేది కాంగ్రెస్ కే!

First Published:  5 Oct 2018 10:16 PM GMT
Next Story