Telugu Global
Cinema & Entertainment

టి.ఆర్.ఎస్ కి సపోర్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ

తొలిసారి తన కెరీర్ లో “నోటా” అనే పూర్తీ స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే రియల్ లైఫ్ లో కూడా విజయ్ దేవరకొండ పాలిటిక్స్ కి మంచి వాల్యూ ఇస్తాడట. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేస్తున్నాడు అనేది విజయ్ దేవరకొండ “నోటా” ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. గతంలో తానూ టి.ఆర్.ఎస్ కు ఒటేశానని, ఇప్పుడు కూడా అదే పార్టీకి వేస్తాను. తనకు కేటిఆర్ పై, […]

టి.ఆర్.ఎస్ కి సపోర్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ
X

తొలిసారి తన కెరీర్ లో “నోటా” అనే పూర్తీ స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే రియల్ లైఫ్ లో కూడా విజయ్ దేవరకొండ పాలిటిక్స్ కి మంచి వాల్యూ ఇస్తాడట. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేస్తున్నాడు అనేది విజయ్ దేవరకొండ “నోటా” ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. గతంలో తానూ టి.ఆర్.ఎస్ కు ఒటేశానని, ఇప్పుడు కూడా అదే పార్టీకి వేస్తాను. తనకు కేటిఆర్ పై, అయన ఐడియాలజీ పై నమ్మకం ఉంది అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కూడా టి.ఆర్.ఎస్ ప్రభుత్వం మంచి అండగా నిలుస్తుంది. అందుకే నాకు ఆ పార్టీ అంటే చాలా ఇష్టం. నేను దానికే ఓటు వేస్తాను అని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. తెలుగు, తమిళంలో తెరకెక్కిన “నోటా” సినిమాపై రెండు పరిశ్రమల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ “నోటా” సినిమా తెలంగాణా రాజకీయాలని ఎలా వేడెకిస్తుందో చూడాలి.

First Published:  4 Oct 2018 11:07 PM GMT
Next Story