Telugu Global
Cinema & Entertainment

మధ్యలో ఆ అమ్మాయిని లాగడం దేనికి ౼ విజయ్ దేవరకొండ

సౌత్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా “నోటా”. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చాడు. “మంచిగా అనిపిస్తోందా ఆ అమ్మాయి?  నేను ఎలాగూ పబ్లిక్. కానీ కంఫర్ట్ లేనప్పుడు మధ్యలో ఆ అమ్మాయిని లాగడం దేనికి?  అందుకే తనగురించి నేను చెప్పను” […]

మధ్యలో ఆ అమ్మాయిని లాగడం దేనికి ౼ విజయ్ దేవరకొండ
X

సౌత్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా “నోటా”. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చాడు.

“మంచిగా అనిపిస్తోందా ఆ అమ్మాయి? నేను ఎలాగూ పబ్లిక్. కానీ కంఫర్ట్ లేనప్పుడు మధ్యలో ఆ అమ్మాయిని లాగడం దేనికి? అందుకే తనగురించి నేను చెప్పను” అని డైరెక్ట్ గా చెప్పేసాడు. అలాగే సోషల్ మీడియా లో హలచల్ చేస్తున్న ఫోటోస్ పై రియాక్ట్ అవుతూ “రెండేళ్ల క్రితం తీసిన ఫోటోలు అవి. అందులో ఉన్నది నేనే. అదేమీ మార్ఫింగు చేసినవి కాని లేదా నేను కాదు వేరొకరు అని కూడా చెప్పను.” అని స్పష్టం చేశాడు.

మళ్ళి మీడియా ఈ విషయం మీద నన్ను కొన్ని రోజులు ప్రశ్నిస్తుంది అని చెప్పి ఈ విషయం మీడియా ముందు చెప్పట్లేదు అని విజయ్ దేవరకొండ సరదాగా సమాధానం దాటి వేసాడు. విజయ్ దేవరకొండ నుంచి సరైన సమాధానం రాకపోయే సరికి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరా అని అందరూ మళ్లి తలలు పట్టుకున్నారు.

First Published:  4 Oct 2018 11:55 PM GMT
Next Story