Telugu Global
NEWS

దాడులు జరగలేదన్న నారాయణ

విజయవాడకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఐటీ బృందాలు రావడం కలకలం రేపింది. మీడియా చానళ్ల అత్యుత్సాహం మరింత గందరగోళాన్ని సృష్టించింది. టీడీపీ మంత్రులు, కీలక నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈనేపథ్యంలో ఐటీ అధికారులు విజయవాడలోని నారాయణ కాలేజీ వైపు వెళ్లడంతో కలకలం రేగింది. మీడియా చానళ్లు ఇదంతా రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయని కథనాలు హోరెత్తించాయి. చంద్రబాబుకు సన్నిహితుడైన నారాయణను టార్గెట్ చేశారని ఆరోపించింది. అయితే ఐటీ దాడులు జరగలేదని నారాయణ […]

దాడులు జరగలేదన్న నారాయణ
X

విజయవాడకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఐటీ బృందాలు రావడం కలకలం రేపింది. మీడియా చానళ్ల అత్యుత్సాహం మరింత గందరగోళాన్ని సృష్టించింది. టీడీపీ మంత్రులు, కీలక నేతలే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది.

ఈనేపథ్యంలో ఐటీ అధికారులు విజయవాడలోని నారాయణ కాలేజీ వైపు వెళ్లడంతో కలకలం రేగింది. మీడియా చానళ్లు ఇదంతా రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయని కథనాలు హోరెత్తించాయి.

చంద్రబాబుకు సన్నిహితుడైన నారాయణను టార్గెట్ చేశారని ఆరోపించింది. అయితే ఐటీ దాడులు జరగలేదని నారాయణ కాలేజీ యాజమాన్యమే ప్రకటించింది. అయితే విజయవాడలో సదరన్‌ కన్‌స్ట్రక్షన్, వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీలపై మాత్రం ఐటీ దాడులు జరుగుతున్నాయి.

రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల నేపథ్యంలో విజయవాడకు ఐటీ సిబ్బంది రాగానే తమపైనా దాడులు జరుగుతాయని టీడీపీ నేతలు ఊహించుకుని ఉలిక్కిపడ్డారని చెబుతున్నారు. బుధవారం టీడీపీ నేత బీదా మస్తాన్‌ రావు ఇళ్లు, ఆఫీస్‌ల పైనా దాడులు జరగడం, రెండు రోజుల క్రితమే టీడీపీ మంత్రులపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం, ఇంతలోనే భారీగా విజయవాడకు ఐటీ బృందాలు రావడంతో టీడీపీలో కలకలం రేగింది.

First Published:  4 Oct 2018 10:24 PM GMT
Next Story