Telugu Global
Health & Life Style

పోషక విలువలు ఎక్కువగా ఉండే తృణ ధాన్యాలు

గోధుమలు, బియ్యము, యవలు ఈ వర్గానికి చెందినవి. శీతల దేశాలలో బార్లీ, ఓట్సు, మొక్కజొన్న, బక్‌వీట్‌ కూడా ఈ వర్గానికి చెందినవే. మనం వీటిని రోజూ అనేకసార్లు అనేక రూపాలలో తింటాము. మన ఆహార పరిమాణంలో వీటిదే సింహభాగం. ప్రస్తుతం వీటిని పారిశ్రామిక ప్రక్రియలతో దీర్ఘకాలికంగా నిలువ వుండటానికి, కంటికి ఇంపుగా కనిపించటానికి, గింజల పైభాగంలోని సూక్ష్మపోషక పదార్థాలనన్నింటినీ ఒలిచివేసి, అతిగా శుభ్రంచేసి అమ్ముతున్నారు. ఇలా అతిగా శుభ్రం చేయబడిన తృణధాన్యాలలో పిండి పదార్థం తప్ప మరేమీ […]

పోషక విలువలు ఎక్కువగా ఉండే  తృణ ధాన్యాలు
X

గోధుమలు, బియ్యము, యవలు ఈ వర్గానికి చెందినవి. శీతల దేశాలలో బార్లీ, ఓట్సు, మొక్కజొన్న, బక్‌వీట్‌ కూడా ఈ వర్గానికి చెందినవే. మనం వీటిని రోజూ అనేకసార్లు అనేక రూపాలలో తింటాము. మన ఆహార పరిమాణంలో వీటిదే సింహభాగం. ప్రస్తుతం వీటిని పారిశ్రామిక ప్రక్రియలతో దీర్ఘకాలికంగా నిలువ వుండటానికి, కంటికి ఇంపుగా కనిపించటానికి, గింజల పైభాగంలోని సూక్ష్మపోషక పదార్థాలనన్నింటినీ ఒలిచివేసి, అతిగా శుభ్రంచేసి అమ్ముతున్నారు. ఇలా అతిగా శుభ్రం చేయబడిన తృణధాన్యాలలో పిండి పదార్థం తప్ప మరేమీ ఉండటం లేదు. ఇవి జీర్ణశక్తిని కుంటుపరచి, ఎసిడిటి, అజీర్తి, ఆకలి లేమి, గ్యాస్‌, మలబద్ధకం లాంటి వ్యాధులకు కారణం అవుతున్నాయి.

పోషక పదార్థాల నిపుణులు, ప్రకృతి వైద్యులు, మూలికా వైద్యులు కూడా వీటిని సాధ్యమైనంత సహజంగా, తవుడు తీయకుండా వాడితే విటమినులు, ఖనిజాలు, నూనెలు పుష్కలంగా లభిస్తాయని, వీటిని జీర్ణించుకోవడం సులభమని నిర్ధారించారు. ఇందుకు వడ్లనుండి ఊక మాత్రమే ఒలిచి, పాలిష్‌ చేయకుండా ఇవ్వమంటే వడ్లమిల్లుల వాళ్ళు ఇస్తారు. ఇవి గతంలో మనకు తెలిసిన దంపుడు బియ్యం కన్నా ఎక్కువ పోషక విలువలుకలవి. గోధుమలను ఎండబెట్టి, మరపట్టించి, అసలు జల్లించకుండా వాడుకుంటే, పోషకపదార్థాలన్ని నిలిచి వుంటాయి.

పశ్చిమ దేశాలలో ఇలాంటి ముతక గోధుమ పిండిని ‘హోల్‌ వీట్‌ ఫ్లోర్‌’ అంటారు. అక్కడ ఇది చాలా విరివిగా లభిస్తోంది. ఇలాంటి బియ్యము, గోధుమ పిండి చాలా రుచిగా కూడా ఉంటాయి. వీటిని సేంద్రీయ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండించితే మరింత మంచిది. వీటిని పశ్చిమ దేశాలలో ఆర్గానిక్‌ గ్రైన్స్‌ అంటారు. వీటి ప్రాచుర్యం పెరుగుతోంది. అధిక ధరలకు కూడా వెనుకాడకుండా పశ్చిమ దేశాల ప్రజలు వీటిని కొని వాడుతున్నారు.

First Published:  4 Oct 2018 8:15 PM GMT
Next Story