Telugu Global
NEWS

మళ్లీ తెరపైకి బూచేపల్లి

ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. కొద్దిరోజలుగా దర్శి ఇన్‌చార్జ్ బాదం మాధవరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల జగన్‌ నిర్వహించిన జిల్లా ఇన్‌చార్జ్‌ల భేటీకి కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరో ఇన్‌చార్జ్‌ కోసం వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అనూహ్యంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన తొలుత నిరాకరించారు. కుటుంబ కారణాలు, ఇతర సమస్యల వల్ల తాను పోటీ చేయలేనని […]

మళ్లీ తెరపైకి బూచేపల్లి
X

ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. కొద్దిరోజలుగా దర్శి ఇన్‌చార్జ్ బాదం మాధవరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల జగన్‌ నిర్వహించిన జిల్లా ఇన్‌చార్జ్‌ల భేటీకి కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరో ఇన్‌చార్జ్‌ కోసం వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అనూహ్యంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు.

2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన తొలుత నిరాకరించారు. కుటుంబ కారణాలు, ఇతర సమస్యల వల్ల తాను పోటీ చేయలేనని జగన్‌కే నేరుగా చెప్పేశారు. దీంతో అక్కడ బాదం మాధవరెడ్డిని జగన్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. కానీ మాధవరెడ్డి ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని సమాచారం. ఇటీవల పార్టీ జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయిన బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి… వచ్చే ఎన్నికల్లో పోటీకి తాను సిద్దమేనని చెప్పారు. అయితే తన తండ్రికి ఆపరేషన్ చేయించాల్సి ఉన్నందున మూడు నెలల గడువు కావాలని బూచేపల్లి కోరారు. ఈ మూడు నెలలు దర్శి బాధ్యతలను జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డికి అప్పగించాలని ప్రతిపాదించారు.

డిసెంబర్‌ నుంచి దర్శి ఇన్‌చార్జ్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలను తీసుకుంటానని వివరించారు. దర్శి నుంచి శివప్రసాద్‌ రెడ్డి పోటీ చేస్తే తిరుగుండదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. శివప్రసాద్‌ రెడ్డి పోటీకి సిద్దపడితే టికెట్ ఇచ్చేందుకు కూడా వైసీపీ నాయకత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెబుతున్నారు. చూడాలి… బూచేపల్లి విషయంలో జగన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో!.

First Published:  5 Oct 2018 12:28 PM GMT
Next Story