Telugu Global
National

భారీగా పెట్రోల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం

అడ్డు అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పెట్రోల్ ధర అతి త్వరలోనే సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర పన్నుతో పాటు దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను వసూలు చేస్తుండడంతో తెలుగు వారు అల్లాడిపోతున్నారు. భారీ వాహనాల వారు పక్క రాష్ట్రాల్లోనే డీజిల్ కొట్టించుకుంటున్నారు. వినియోగదారులను భయపెడుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల విషయంలో తగ్గింపుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రెండు […]

భారీగా పెట్రోల్ ధరలు తగ్గించేందుకు కేంద్రం నిర్ణయం
X

అడ్డు అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పెట్రోల్ ధర అతి త్వరలోనే సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర పన్నుతో పాటు దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను వసూలు చేస్తుండడంతో తెలుగు వారు అల్లాడిపోతున్నారు.

భారీ వాహనాల వారు పక్క రాష్ట్రాల్లోనే డీజిల్ కొట్టించుకుంటున్నారు. వినియోగదారులను భయపెడుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరల విషయంలో తగ్గింపుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రెండు రూపాయల 50 పైసలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది.

రాష్ట్రాలు కూడా తమ పన్నులను తగ్గించి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో రెండు రూపాయల 50 పైసలు తగ్గించాలని కేంద్రం సూచించింది. ప్రస్తుత తగ్గింపు నిర్ణయంతో కేంద్రానికి వచ్చే ఆదాయంలో 21 వేల కోట్లు తగ్గిపోనుంది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపులో రాష్ట్ర ప్రభుత్వాలే చురుగ్గా వ్యవహరించాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు.

First Published:  4 Oct 2018 4:46 AM GMT
Next Story