Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్‌ బయోపిక్‌ టైటిల్‌ మార్పు.... రెండు భాగాలకు రెండు పేర్లు

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్‌ టైటిల్‌ మార్పు చేశారు. బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తుండగా… చంద్రబాబు క్యారెక్టర్‌కు రానాను ఎంపిక చేశారు. క్రిష్ దర్శకత్వంలో షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. అయితే బయోపిక్‌ను ఒక భాగంగా కాకుండా రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు. మొదటి భాగాన్ని ఎన్టీఆర్ చిత్ర జీవితానికి పరిమితం చేయడం, రెండు భాగంలో రాజకీయ ప్రస్తానాన్ని చూపించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రెండు భాగాలకు రెండు పేర్లు ఎంపిక చేశారు. మొదటి భాగానికి […]

ఎన్టీఆర్‌ బయోపిక్‌ టైటిల్‌ మార్పు.... రెండు భాగాలకు రెండు పేర్లు
X

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న బయోపిక్‌ టైటిల్‌ మార్పు చేశారు. బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తుండగా… చంద్రబాబు క్యారెక్టర్‌కు రానాను ఎంపిక చేశారు.

క్రిష్ దర్శకత్వంలో షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. అయితే బయోపిక్‌ను ఒక భాగంగా కాకుండా రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు. మొదటి భాగాన్ని ఎన్టీఆర్ చిత్ర జీవితానికి పరిమితం చేయడం, రెండు భాగంలో రాజకీయ ప్రస్తానాన్ని చూపించాలని నిర్ణయించుకున్నారు.

అందులో భాగంగా రెండు భాగాలకు రెండు పేర్లు ఎంపిక చేశారు. మొదటి భాగానికి ”ఎన్టీఆర్‌ కథానాయకుడు” అన్న టైటిల్ ఓకే చేశారు. రెండో భాగానికి ”ఎన్టీఆర్‌ మహానాయకుడు” అన్న పేరు ఖరారు చేశారు. మొదటి భాగాన్ని జనవరి 9న విడుదల చేయబోతున్నారు. రెండో భాగం ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఇంకా తెలియడం లేదు.

First Published:  4 Oct 2018 4:06 AM GMT
Next Story