Telugu Global
NEWS

ఈ ముగ్గురు నాయకులకు ప్రాముఖ్యం తగ్గించిన కేసీఆర్‌

క‌డియం శ్రీహ‌రి, స‌ముద్రాల వేణుగోపాలచారి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. టీడీపీలో సీనియ‌ర్ నేత‌లు. ఆ పార్టీలో ఉండ‌గా ఈ నేత‌లు తిప్పిందే చ‌క్రం. అయితే తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత వీరంతా టీఆర్ఎస్‌లో చేరారు. ఒకరి త‌ర్వాత ఒక‌రు కారు ఎక్కారు. అయితే ఇప్పుడు కారులో మాత్రం వీరికి ఉక్క‌పోత త‌ప్ప‌డం లేదు. వ‌రంగ‌ల్ నుంచి ఎంపీగా గెలిచిన క‌డియం శ్రీహ‌రి…ఆ త‌ర్వాత రాజ‌య్య రాజీనామా ప‌రిణామాల‌తో డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ ఎన్నిక‌ల్లో కుదిరితే స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి […]

ఈ ముగ్గురు నాయకులకు ప్రాముఖ్యం తగ్గించిన కేసీఆర్‌
X

క‌డియం శ్రీహ‌రి, స‌ముద్రాల వేణుగోపాలచారి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు. టీడీపీలో సీనియ‌ర్ నేత‌లు. ఆ పార్టీలో ఉండ‌గా ఈ నేత‌లు తిప్పిందే చ‌క్రం. అయితే తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత వీరంతా టీఆర్ఎస్‌లో చేరారు. ఒకరి త‌ర్వాత ఒక‌రు కారు ఎక్కారు. అయితే ఇప్పుడు కారులో మాత్రం వీరికి ఉక్క‌పోత త‌ప్ప‌డం లేదు.

వ‌రంగ‌ల్ నుంచి ఎంపీగా గెలిచిన క‌డియం శ్రీహ‌రి…ఆ త‌ర్వాత రాజ‌య్య రాజీనామా ప‌రిణామాల‌తో డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ ఎన్నిక‌ల్లో కుదిరితే స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని అనుకున్నారు. తాను కుదర‌క‌పోతే త‌న కూతురు కావ్య‌ను బ‌రిలోకి దింపాల‌ని ఆశ‌లు పెంచుకున్నారు.

అయితే ఆయ‌న ఆశ‌లపై కేసీఆర్ నీళ్లు చ‌ల్లారు. క‌డియంకు టిక్కెట్ ఇవ్వ‌లేదు. ఆయ‌న కూతురు కావ్య‌కు అవ‌కాశం రాలేదు. దీంతో ఆయ‌న అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు. ఇటు అల్లుడు నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా ఈసారి పోటీ చేద్దామ‌ని పోరు పెట్టారు. క‌డియం ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌యం స్థితిలో ఉన్నారు.

కేటీఆర్‌తో మీటింగ్ పెట్టారు. రాజ‌య్య‌ని మార్చాల‌నే డిమాండ్ పెట్టారు. అయితే ఆయ‌న ఒప్పుకోలేదు. ఇప్పుడు క‌డియం ఏం చేస్తార‌నేది ఓ పెద్ద ప్ర‌శ్న‌. వ‌రంగ‌ల్ ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం కూతురు కావ్య‌కు ఇస్తార‌నేది కూడా ఓ పెద్ద డౌట్‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌డియం ఏం చేస్తారా అని ఆయ‌న అనుచ‌రులే కాదు… రాజ‌కీయ ప‌రిశీలకులు కూడా ఎదురుచూస్తున్నారు.

స‌ముద్రాల వేణుగోపాల‌చారిది కూడా సేమ్ టు సేమ్ క‌డియం ప‌రిస్థితి. కేసీఆర్ ఎమ్మెల్యేగా అయిన‌పుడు ఆయ‌న కూడా నిర్మ‌ల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు కోట‌రీలో కీల‌క‌మెంబ‌ర్‌. కేసీఆర్‌తో కూడా స‌న్నిహిత్యం ఉంది. 2014 ఎన్నిక‌ల్లో ముథోల్ నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఆయ‌న మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో చారి హ‌వాకు బ్రేక్ ప‌డింది. ముథోల్‌లో త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో పంచాయ‌తీ మొద‌లైంది. ఢిల్లీలో ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా చారిని కేసీఆర్ పంపించారు. ముథోల్ నుంచి ఈసారి పోటీ చేయాల‌ని చారి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే ఆయ‌న‌కు మాత్రం కేసీఆర్ క‌రుణ ల‌భించ‌లేదు.

ఇప్పుడు విఠ‌ల్‌రెడ్డిని మార్చాల‌ని చారి వ‌ర్గం ఆందోళ‌న‌లు చేస్తోంది. కేటీఆర్ మాత్రం క్యాండిడేట్ల‌ను మార్చేది లేద‌ని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏం చేయాల‌నే ఆలోచ‌న‌లో చారి వ‌ర్గం ప‌డింది. వారం రోజులుగా భైంసాలోనే మ‌కాం వేసిన వేణుగోపాల చారి… కీల‌క నిర్ణ‌యం ఏం తీసుకుంటారా? అని ఆయ‌న వ‌ర్గం నేత‌లు ఎదురుచూస్తున్నారు.

క‌డియం, చారిది ఒక టైపు ఆవేద‌న అయితే…. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావుది మ‌రో సిట్యుయేష‌న్‌. పాలేరు నుంచి ఆయ‌న మ‌ళ్లీ పోటీ చేస్తున్నాడు. అంత వ‌ర‌కూ ఒకే. కానీ ఈసారి త‌న వ‌ర్గం నుంచి ఇద్ద‌రు ముగ్గురు నేత‌ల‌ను ఎమ్మెల్యేగా బ‌రిలోకి దింపాల‌ని ప్లాన్ వేశాడు. కానీ ఆయ‌న ఆశ‌ల‌పై కూడా కేసీఆర్ నీళ్లు చ‌ల్లారు.

స‌త్తుప‌ల్లి నుంచి ద‌యానంద్‌, వైరా,అశ్వ‌రావుపేట‌తో పాటు ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో తన వ‌ర్గం అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టాల‌ని అనుకున్నాడు. ఇప్పుడు త‌న వ‌ర్గానికి టికెట్లు రాక‌పోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న నిరాశ‌లో మునిగిపోయారు. త‌న సన్నిహితుల ద‌గ్గ‌ర అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టారు.

అయితే తుమ్మలకు నోటీదూల ఎక్కువ. ఎవరినంటే వాళ్ళను ఎంత మాట అంటే అంత మాట అనే అహంకారం. తన పరిధిలోని అధికారులను కూడా బూతులు తిడతాడు. పార్టీ ప్రయోజనాలకన్నా తన సామాజిక వర్గ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడనేది కేసీఆర్‌కు కోపం. అందుకే తుమ్మల కోరుకున్నట్లు ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వలేదు. దాంతో తుమ్మల గుర్రుగా ఉన్నాడు.

ఈ ముగ్గురు నేత‌లే కాదు. టీఆర్ఎస్‌లో చాలా మంది నేత‌ల్లో అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఒక‌వేళ టీఆర్ఎస్ స‌ర్కార్ మ‌ళ్లీ వ‌స్తే మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోతారా? మ‌ంచి అవ‌కాశం రాక‌పోతుందా? దాన్ని ఎందుకు చెడ‌గొట్టుకోవాల‌నే ముందుచూపుతో బ‌య‌ట‌కు ఎవ‌రూ మాట్లాడ‌డం లేద‌ని తెలుస్తోంది. మొత్తానికి గులాబీ గుంపులో అసంతృప్తి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. అది ఎప్పుడూ ఏ రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుందో మాత్రం తెలియకుండా ఉంది.

First Published:  3 Oct 2018 12:22 AM GMT
Next Story