Telugu Global
NEWS

తెలంగాణ న్యాయాధికారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

తెలంగాణ న్యాయాధికారులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానికత ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలన్న టీ న్యాయాధికారుల డిమాండ్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సీనియారిటీ ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం సమర్ధించింది. రాష్ట్ర విభజన జరిగిందే కొలువుల కోసమని…. అలాంటప్పుడు విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టికల్ 234 ప్రకారం హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం సరైంది కాదని తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీం కోర్టును […]

తెలంగాణ న్యాయాధికారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ
X

తెలంగాణ న్యాయాధికారులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానికత ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలన్న టీ న్యాయాధికారుల డిమాండ్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సీనియారిటీ ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం సమర్ధించింది. రాష్ట్ర విభజన జరిగిందే కొలువుల కోసమని…. అలాంటప్పుడు విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టికల్ 234 ప్రకారం హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం సరైంది కాదని తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ప్రమోషన్లు ఇస్తే తెలంగాణకు చెందిన వారు మరో 40ఏళ్లు అయినా సరే హైకోర్టులో న్యాయమూర్తులు కాలేరని టీ న్యాయాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఉమ్మడి ఏపీలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ చేసిన న్యాయాధికారుల సీనియారిటీని కాదనలేమని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి స్థానికత ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలన్న డిమాండ్ సరికాదని వ్యాఖ్యానించింది. సీనియారిటీ ఆధారంగానే ముందుకెళ్లాలని ఆదేశించింది సుప్రీం కోర్టు.

First Published:  3 Oct 2018 3:58 AM GMT
Next Story