Telugu Global
International

రూపాయి ఢమాల్.... డాలర్ తో అత్యంత తక్కువకు....

రూపాయి విలవిలలాడుతోంది. అమెరికా కరెన్సీ డాలర్ డిమాండ్ కు తట్టుకొని నిలవలేకపోతోంది.తాజాగా రూపాయి భారీగా క్షీణించింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ హయాంలో ఇంత భారీ పతనం ఎప్పుడూ ఎదురుకాలేదు. యూపీఏ హయాంలో రూ.50 కి అటూ ఇటుగా ఉన్న రూపాయి.. బీజేపీ ప్రభుత్వంలో మాత్రం పట్టపగ్గాలు లేకుండా దిగజారుతోంది. తాజాగా బుధవారం నాటి ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.73.34 వద్ద ముంబై స్టాక్ ఎక్స్చేంజీలో నమోదై మార్కెట్ చరిత్రలోనే జీవితకాల కనిష్టాన్ని […]

రూపాయి ఢమాల్.... డాలర్ తో అత్యంత తక్కువకు....
X

రూపాయి విలవిలలాడుతోంది. అమెరికా కరెన్సీ డాలర్ డిమాండ్ కు తట్టుకొని నిలవలేకపోతోంది.తాజాగా రూపాయి భారీగా క్షీణించింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ హయాంలో ఇంత భారీ పతనం ఎప్పుడూ ఎదురుకాలేదు. యూపీఏ హయాంలో రూ.50 కి అటూ ఇటుగా ఉన్న రూపాయి.. బీజేపీ ప్రభుత్వంలో మాత్రం పట్టపగ్గాలు లేకుండా దిగజారుతోంది.

తాజాగా బుధవారం నాటి ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.73.34 వద్ద ముంబై స్టాక్ ఎక్స్చేంజీలో నమోదై మార్కెట్ చరిత్రలోనే జీవితకాల కనిష్టాన్ని తాకింది. మంగళవారం రూ. 72.91 వద్ద ఉన్నరూపాయి నేడు 35 పైసలు నష్టపోయి 73.26 వద్ద ప్రారంభమైంది. బుధవారం ఉదయం 11 గంటల వరకూ 73.33కు పడిపోయింది.

రూపాయి విలువ పడిపోవడానికి ముడిచమురు ధరలు పెరగడం…. విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడమే ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దిగుమతుల నుంచి డాలర్ కు డిమాండ్ పెరగడం కూడా రూపాయి పడిపోవడానికి కారణమవుతోంది.

భారత మార్కెట్ నుంచి రూ.1842 కోట్ల పెట్టుబడులను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతోపాటు అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ 85 డాలర్లుగా ఉంది. రూపాయి పతనంతో భారతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. దేశీయ మార్కెట్లన్నీ నష్లాల్లో కూరుకుపోయాయి.

రూపాయి ఇంతలా పతనం అవుతున్నా ఆర్బీఐ, బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా అయితే విదేశాల నుంచి దిగుమతులు చాలా ఖరీదుగా మారుతాయని భారత వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  3 Oct 2018 12:20 AM GMT
Next Story