Telugu Global
NEWS

పరిటాల కుటుంబానికి "నో" చెప్పిన చంద్రబాబు

ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించాలని పరిటాల సునీత ప్రయత్నిస్తోంది. తమ అంగ, అర్థబలంతో నెగ్గగలమని పరిటాల కుటుంబం అనుకుంటోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వారికి ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. ఇటీవల పరిటాల సునీత తనయుడి కోసం హిందూపురం ఎంపీ సీటును అడిగినట్టుగా తెలుస్తోంది. తను రాప్తాడు నుంచి పోటీ చేయడానికి, తన తనయుడిని హిందూపురం ఎంపీగా పోటీ చేయించడానికి సునీత ప్రయత్నించింది. అయితే దానికి చంద్రబాబు నుంచి సానుకూల […]

పరిటాల కుటుంబానికి నో చెప్పిన చంద్రబాబు
X

ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీ చేయించాలని పరిటాల సునీత ప్రయత్నిస్తోంది. తమ అంగ, అర్థబలంతో నెగ్గగలమని పరిటాల కుటుంబం అనుకుంటోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వారికి ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు.

ఇటీవల పరిటాల సునీత తనయుడి కోసం హిందూపురం ఎంపీ సీటును అడిగినట్టుగా తెలుస్తోంది. తను రాప్తాడు నుంచి పోటీ చేయడానికి, తన తనయుడిని హిందూపురం ఎంపీగా పోటీ చేయించడానికి సునీత ప్రయత్నించింది. అయితే దానికి చంద్రబాబు నుంచి సానుకూల స్పందన రాలేదని స్పష్టం అవుతోంది.

తాజాగా చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులు వీరే అనే లీకులు ఇచ్చాడు. ఆ లీకుల్లో సగం సీట్లలో సిట్టింగులు అలాగే పోటీ చేస్తారని బాబు పేర్కొన్నాడని సమాచారం. అలా పోటీ చేయబోయే సిట్టింగు ఎంపీల్లో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ పరిటాల శ్రీరామ్‌కు హిందూపురం నుంచి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అనుకుని ఉంటే… అక్కడ నిమ్మల కిష్టప్ప పేరు ఉండేది కాదు.

ఈ లీకులు స్వయంగా తెలుగుదేశం అనుకూల మీడియాలోనే వచ్చాయి. వాటి ప్రకారం 12 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి అదే స్థానాలనుంచి పోటీ చేస్తారని, మిగిలిన 13 సీట్లకూ కొత్త అభ్యర్థులు వస్తారని తెలుగుదేశం అధినేత అంటున్నాడట. ఈ మేరకు తన అనుకూల మీడియాలో వార్తలు రాయించి నేతలకు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ లెక్కన పరిటాల కుటుంబం కోరుకుంటున్నట్టుగా…. శ్రీరామ్ కు హిందూపురం ఎంపీ సీటు దక్కే అవకాశాలు లేవని తెలుగుదేశం వర్గాలు చర్చించుకుంటున్నాయి.

First Published:  3 Oct 2018 6:15 AM GMT
Next Story