Telugu Global
NEWS

థూ.. మీ బతుకులు... చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్

తెలంగాణ ఎన్నికల వేడి రాజుకుంటోంది. కేసీఆర్‌ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్‌…. కాంగ్రెస్‌, బీజేపీ లపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ”థూ.. మీ బతుకులు చెడ.. చంద్రబాబుతో పొత్తా” అని మండిపడ్డారు. ”థూ…. మీ బతుకులు చెడ…. ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో…. తెలంగాణ ద్రోహి…. చెడిపోయి చంద్రబాబుతో పొత్తా? అడుక్కుంటే మేం ఇస్తాం కదా నాలుగు సీట్లు. కరెంట్ ఇవ్వకుండా […]

థూ.. మీ బతుకులు... చంద్రబాబుపై కేసీఆర్ ఫైర్
X

తెలంగాణ ఎన్నికల వేడి రాజుకుంటోంది. కేసీఆర్‌ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన కేసీఆర్‌…. కాంగ్రెస్‌, బీజేపీ లపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ”థూ.. మీ బతుకులు చెడ.. చంద్రబాబుతో పొత్తా” అని మండిపడ్డారు.

”థూ…. మీ బతుకులు చెడ…. ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో…. తెలంగాణ ద్రోహి…. చెడిపోయి చంద్రబాబుతో పొత్తా? అడుక్కుంటే మేం ఇస్తాం కదా నాలుగు సీట్లు. కరెంట్ ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసి చంద్రబాబు. మళ్లా ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తారా? ”అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

”తెలంగాణలో ఎన్నికల కోసం చంద్రబాబు 500 కోట్లు ఇస్తాడట…. మూడు హెలికాప్టర్లు పెడతాడంట…. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెడుతారా? అని ప్రశ్నించారు.

అధికారంలోకి వస్తే ఇళ్ల అద్దె చెల్లిస్తామంటూ బీజేపీ హామీ ఇవ్వడంపైనా కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. ఎన్నికల ముందు నోటికొచ్చినట్టు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఇదే మోడీ, అమిత్ షాలు ఎన్నికల సమయంలో విదేశాల్లోని నల్లధనం మొత్తం తెచ్చి ప్రతి ఖాతాలోకి 15 లక్షలు వేస్తామన్నారని…. కానీ అలా చేశారా? అని ప్రశ్నించారు. ప్రజలను గొర్రెలనుకుంటున్నారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

First Published:  3 Oct 2018 10:55 AM GMT
Next Story