Telugu Global
Others

మానవ, వన్యప్రాణి ఘర్షణ

నరమాంసానికి అలవాటుపడిన ఒక పులిని అదుపు చేసే విషయంలో గత కొన్ని వారాలుగా మహారాష్ట్రలోని రాలే గావ్ లో వన్య ప్రాణి సంరక్షకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామస్థులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆ ఆడ పులికి రెండు పిల్లలు కూడా ఉన్నాయి. దాన్ని కాల్చి చంపాలని అటవీ అధికారులు భావించినప్పుడు వన్యప్రాణి సంరక్షకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పులిని చంపడాన్ని నిషేధించలేదు. ఆ పులిని పట్టుకునే ప్రయత్నాలు విఫలమైతే అటవీ అధికారులు దాన్ని కాల్చి […]

మానవ, వన్యప్రాణి ఘర్షణ
X

నరమాంసానికి అలవాటుపడిన ఒక పులిని అదుపు చేసే విషయంలో గత కొన్ని వారాలుగా మహారాష్ట్రలోని రాలే గావ్ లో వన్య ప్రాణి సంరక్షకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రామస్థులకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆ ఆడ పులికి రెండు పిల్లలు కూడా ఉన్నాయి. దాన్ని కాల్చి చంపాలని అటవీ అధికారులు భావించినప్పుడు వన్యప్రాణి సంరక్షకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆ పులిని చంపడాన్ని నిషేధించలేదు.

ఆ పులిని పట్టుకునే ప్రయత్నాలు విఫలమైతే అటవీ అధికారులు దాన్ని కాల్చి వేయవచ్చు. వన్య ప్రాణులు ప్రజల మీద దాడి చేయడం కొన్ని సార్లు నమ్మశక్యం కానిదిగా, మరికొన్ని సార్లు భయపడేట్టుగా ఉంటుంది. వన్యప్రాణుల దాడివల్ల ప్రాణాలు పోవడమో, తీవ్రంగా గాయపడడమో భారీగా ఉంటే భయాందోళన మరింత పెరుగుతుంది. వన్యప్రాణులు నరమాంస భక్షకాలు అవునా కాదా అని నిర్ణయించడం కష్టమని, ఎందుకంటే ఇలాంటి సందర్భాలు అరుదు అని వన్యప్రాణి సంరక్షకులు అంటున్నారు. ఒక పులి నరమాంస భక్షకి అవునా కాదా అని నిర్ణయించడం మరింత కష్టం. కాని పులిబారిన పడే ప్రజల భయం కాదనలేనిది.

ఇలాంటి పరిస్థితిలో తప్పెవరిది అని నిర్ధారించడం అవసరం. జంతువును నిందించి లాభం లేదని వన్యప్రాణి సంరక్షకులు అంటారు. మనుషుల ప్రాణ భయం ఈ సందర్భాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. రంతంబోర్ లో ఉస్తాద్ అనే ఒక పులి మనుషుల మీద దాడి చేసినప్పుడు కూడా ఇలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత ఉస్తాద్ ను జంతుప్రదర్శనశాలకు పంపించారు. జంతువు నరమాంస భక్షకి అవునో కాదో నిర్ణయించడం సాధ్యం కాదు కనక న్యాయస్థానం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయించవలసింది క్షేత్ర స్థాయిలో పని చేసే అటవీ శాఖ అధికారులే.

మనుషుల్ని చంపే పులులను, చిరుత పులులను గుర్తించడం చాలా సందర్భాలలో అరకొరగానే ఉంటుంది. ఇదివరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో మనుషులను చంపే చిరుతపులులను హతమార్చారు. అయితే అవి మనుషులను చంపేవో కాదో నియత పద్ధతి ప్రకారం నిర్ధారించలేదు. ప్రతి పులికి, చిరుతకు భిన్నమైన చారలుంటాయి. వాటినిబట్టి మనుషులను చంపేది ఏదో గుర్తించాలి. ఇది ఆ జంతువులను చూసి కానీ ఫొటోలు తీసికానీ గుర్తించాలి. వన్యప్రాణి మనుషులను చంపేదా, నరమాంస భక్షకా అని గుర్తించాలని జాతీయ పులుల సంరక్షణా సంస్థ చెప్తుంది. మనుషులను చంపేవి అయితే పరిస్థితినిబట్టి అది ప్రమాదవశాత్తు జరిగేది కావొచ్చు. అసలు తెలుసుకోవాల్సింది ఆ జీవి నరమాంసానికి అలవాటు పడింది అవునో కాదో.

అయినా నరమాంస భక్షక జీవులను గుర్తించడంలో అనైతిక పద్ధతులు అనుసరించిన ఉదంతాలు ఉన్నాయి. 1972 నాటి వన్యప్రాణి సంరక్షణా చట్టం ప్రకారం వన్య మృగాలను వేటాడడం నిషేధం. వన్యప్రాణి సంరక్షక ప్రధానాధికారి అనుమతి ఉంటే ఆ మృగాన్ని చంపాలి. నరమాంసానికి అలవాటుపడిన వన్యప్రాణులు అయితే చట్టబద్ధంగా వాటిని చంపాలి. లేదా కట్టడి చేయాలి. ఈ చర్య కచ్చితంగా, ప్రభుత్వ అనుమతి ప్రకారం జరగాలి. ఇందులో కక్షకు అవకాశం ఉండకూడదు.

సమస్యాత్మకమైన వన్యప్రాణులను అంతమొందించిన సమయంలో సాధారణంగా చంపిన వ్యక్తి భుజాన తుపాకీ వేలాడుతున్నట్టో లేదా ఆ మృగం అతని కాళ్ల దగ్గర పడి ఉన్నట్టో ఉన్న చిత్రాలు ప్రచారంలోకి వస్తాయి. చంపిన వ్యక్తి ఏదో వీరోచిత కార్యక్రమం సాధించినట్టు ఈ చిత్రాలు ఉంటాయి. జరగాల్సిందల్లా ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారాలు వెతకడం. ఈ అంశాన్ని దృష్టిలో ఉచుకునే పత్రికలలోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చంపిన జంతువుల చిత్రాలు ప్రచురించకూడదని, ప్రసారం చేయకూడదాని ఉత్తరాఖండ్ కోర్టు 2016నాటి తీర్పులో పేర్కొంది.

నరమాంస భక్షణకు అలవాటు పడిన మృగాలను అదుపు చేయడం వన్యప్రాణుల సంరక్షణా దృష్టితో జరగాలి. అది వన్యప్రాణుల హక్కుకు విరుద్ధంగా ఉండకూడదు. వన్యప్రాణులను రక్షించడం ప్రజల సహకారం లేనిదే సాధ్యం కాదు. వన్యప్రాణుల సంరక్షణ మానవజాతి ఎదుగుదల పరిణామ దశలకు అనుగుణంగా ఉండక తప్పదు.

వన్యప్రాణి సంరక్షణ జంతువులను కాపడడానికి పరిమితమైన వ్యవహారం. దానిలో ఉన్న సాధకబాధకాలతో నిమిత్తం లేనిది. అందువల్ల నరమాంస భక్షణకు అలవాటు పడిన వన్యప్రాణులను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడవలసిందే అన్న వాదన చెల్లదు. మానవుల, జంతువుల సహజీవనం కేవలం జనాకర్షక విధానాలమీదో వన్యప్రాణుల సంరక్షణ మీద మాత్రమే సాగడానికి అవకాశం లేదు.

వన్యప్రాణులను కాపడడంలో ఎవరి బాధ్యత ఎంత అన్న విషయం గ్రహించాలంటే మానవుల, వన్యప్రాణుల మధ్య ఘర్షణకు కారణం ఏమిటి, ఈ విషయంలో అసహనానికి కారణం ఏమిటి అని అంచనా వేయాలి. ఎలాంటి తోడ్పాటు లేకుండా వన్యప్రాణుల సంరక్షణ కోసం పేదల ప్రాణాలను బలిపెట్టడం భావ్యం కాదు. ఈ ఘర్షణను ఇతర సవాళ్లతో పాటు కలిపి పరిశీలించాలి. మానవుల దైనందిన కార్యకలాపాల్లో ఎదురయ్యే నిరాశా నిస్పృహలవల్ల అది వారి గణ చిహ్నమూ కావచ్చు.

అందువల్ల చేయాల్సిందల్ల పరిష్కారాలు కనుగొనడానికి క్షేత్రస్థాయి పరిశీలనే. పంటల, పశుసంతతి బీమా జనానుకూలంగా, ఆచరణ సాధ్యంగా ఉండాలి. వన్యప్రాణులకు దూరంగా ఎలా ఉండాలో ప్రజలకు తెలియజెప్పాలి. మనుషులకు, వన్యప్రాణులకు మధ్య వచ్చే ఘర్షణలను అటవీశాఖ న్యాయంగా, సత్వరంగా, నిరంతరంగా నివారించాలి. ఏ దశలోనూ అద్భుతాలకు తావివ్వకూడదు. ఒక నిర్దిష్ట ప్రాంత ప్రజలు జీవించే ప్రాంతాన్ని గమనించి పరిష్కారాలు అన్వేషించాలి. పశు సంతతిని పరిరక్షించడంలో ఉండే సమస్యలను గుర్తించాలి. మనుషుల నుంచి వచ్చే ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ కచ్చితమైన, నిర్దిష్ట ప్రాంతానికి వర్తించే చర్యలు తీసుకోవడం ఆకాంక్షించదగినదే కాదు అత్యవసరమైంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  2 Oct 2018 11:07 PM GMT
Next Story