Telugu Global
Cinema & Entertainment

గీతగోవిందం.. మరో రికార్డు

నోటా సినిమా విడుదలకు సిద్ధమౌతున్న ఈ టైమ్ లో విజయ్ దేవరకొండ మరో గుడ్ న్యూస్ అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే మరో చిన్న రికార్డు సృష్టించాడు. ఇతడ నటించిన తాజా చిత్రం గీతగోవిందం ఇవాళ్టితో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఏకంగా 59 సెంటర్లలో 50 రోజులాడి, విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది గీతగోవిందం సినిమా. గీతగోవిందం కంటే ముందు విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి ఉంది. అది […]

గీతగోవిందం.. మరో రికార్డు
X

నోటా సినిమా విడుదలకు సిద్ధమౌతున్న ఈ టైమ్ లో విజయ్ దేవరకొండ మరో గుడ్ న్యూస్ అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే మరో చిన్న రికార్డు సృష్టించాడు. ఇతడ నటించిన తాజా చిత్రం గీతగోవిందం ఇవాళ్టితో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఏకంగా 59 సెంటర్లలో 50 రోజులాడి, విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది గీతగోవిందం సినిమా.

గీతగోవిందం కంటే ముందు విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి ఉంది. అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే కల్ట్ మూవీగా నిలిచిపోయింది. కానీ వసూళ్ల పరంగా చూస్తే దేవరకొండ కెరీర్ లో బెస్ట్ సినిమా గీతగోవిందం మాత్రమే.

ఈ ఊపులో నోటాను విడుదల చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది నోటా సినిమా. ఎమోషన్ పరంగా అర్జున్ రెడ్డి, నోటా సినిమాల్లో తన పాత్రలకు చాలా దగ్గర సంబంధాలున్నాయంటున్నాడు విజయ్ దేవరకొండ. చాలా సన్నివేశాల్లో తన క్యారెక్టర్ ఎగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుందని, నోటాలో అక్కడక్కడ మరో అర్జున్ రెడ్డిని చూస్తారని అంటున్నాడు విజయ్ దేవరకొండ.

First Published:  3 Oct 2018 7:39 AM GMT
Next Story