Telugu Global
National

ఢిల్లీలో రణరంగం... దూసుకొచ్చిన వేలాది మంది రైతులు

రైతు గుండె రగిలింది. ఇంతకాలం సహనంతో ప్రతికూల పరిస్థితులను ఓర్చుకున్న అన్నదాతలు… బీజేపీ సర్కార్‌పై పోరాటాన్ని ప్రకటించారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో పాటు పలు డిమాండ్‌లతో ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ వైపు దూసుకొచ్చారు. వేలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళనకు తరలివచ్చారు. వేలాది మంది రైతులు నగరం వైపు పోటెత్తడంతో యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ వైపు వెళ్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడితో పలువురు రైతులు తీవ్రంగా […]

ఢిల్లీలో రణరంగం... దూసుకొచ్చిన వేలాది మంది రైతులు
X

రైతు గుండె రగిలింది. ఇంతకాలం సహనంతో ప్రతికూల పరిస్థితులను ఓర్చుకున్న అన్నదాతలు… బీజేపీ సర్కార్‌పై పోరాటాన్ని ప్రకటించారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో పాటు పలు డిమాండ్‌లతో ఉత్తరప్రదేశ్ రైతులు ఢిల్లీ వైపు దూసుకొచ్చారు.

వేలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళనకు తరలివచ్చారు. వేలాది మంది రైతులు నగరం వైపు పోటెత్తడంతో యూపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీ వైపు వెళ్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.

విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడితో పలువురు రైతులు తీవ్రంగా గాయపడి రోడ్లపైనే పడిపోయారు. ప్రధాన రహదారుల వెంబడి చాలా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినా వాటిని తొలగిస్తూ రైతులు ముందుకు సాగారు.

రైతుల ఆందోళనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. నిరసన తెలిపేందుకు ఢిల్లీకి వస్తున్న రైతులపై యూపీ పోలీసులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. కాబట్టి రైతులను ఢిల్లీలోకి అనుమతించాని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

First Published:  2 Oct 2018 1:42 AM GMT
Next Story