Telugu Global
NEWS

నా మద్దతు టీడీపీకే " ప్రబోధానంద స్వామి

పెద్దన్న చౌదరి అలియాస్ ప్రబోధానంద స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జేసీ బ్రదర్స్‌ టార్గెట్‌ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో తాను టీడీపీకే మద్దతుగా నిలిచానని చెప్పారు. అయినా సరే చంద్రబాబు కూడా తన వైపు గట్టిగా నిలబడలేదన్నారు. జేసీ బ్రదర్స్ ఆగడాలన్నీ టీడీపీ ప్రభుత్వానికి తెలుసనీ…. అయినా చంద్రబాబు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రబోధానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటికీ తన ఆశ్రమంపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. […]

నా మద్దతు టీడీపీకే  ప్రబోధానంద స్వామి
X

పెద్దన్న చౌదరి అలియాస్ ప్రబోధానంద స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జేసీ బ్రదర్స్‌ టార్గెట్‌ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో తాను టీడీపీకే మద్దతుగా నిలిచానని చెప్పారు.

అయినా సరే చంద్రబాబు కూడా తన వైపు గట్టిగా నిలబడలేదన్నారు. జేసీ బ్రదర్స్ ఆగడాలన్నీ టీడీపీ ప్రభుత్వానికి తెలుసనీ…. అయినా చంద్రబాబు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రబోధానంద అసంతృప్తి వ్యక్తం చేశారు.

టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటికీ తన ఆశ్రమంపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రబోధానంద ప్రశ్నించారు.

డబ్బులు తీసుకుని పోలీసులు దగ్గరుండి జేసీ మనుషులను తమపైకి ఉసిగొల్పారని మండిపడ్డారు. పోలీసులు దివాకర్‌ రెడ్డితో చేతులు కలపడం వల్లే ఆశ్రమం వద్ద హింస చెలరేగిందని ఆరోపించారు ప్రబోధానంద.

First Published:  2 Oct 2018 7:42 AM GMT
Next Story