Telugu Global
Cinema & Entertainment

నిజంగా చెప్పాడా.. సరదాగా అన్నాడా?

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివపై ఇదే డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. నోటా పబ్లిక్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు కొరటాల శివ. విజయ్ దేవరకొండ గురించి 2 మంచి ముక్కలు మాట్లాడాలి కాబట్టి మైక్ అందుకున్నాడు, చెప్పాల్సింది చెప్పేశాడు. అంతా బాగానే ఉంది కానీ విజయ్ దేవరకొండతో తను ఓ సినిమా తీస్తానంటూ కొరటాల చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. విజయ్ దేవరకొండ స్టార్ కావొచ్చు. కానీ కొరటాల అంతకుమించి. ఇతడి డిమాండ్ […]

నిజంగా చెప్పాడా.. సరదాగా అన్నాడా?
X

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివపై ఇదే డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. నోటా పబ్లిక్ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు కొరటాల శివ. విజయ్ దేవరకొండ గురించి 2 మంచి ముక్కలు మాట్లాడాలి కాబట్టి మైక్ అందుకున్నాడు, చెప్పాల్సింది చెప్పేశాడు. అంతా బాగానే ఉంది కానీ విజయ్ దేవరకొండతో తను ఓ సినిమా తీస్తానంటూ కొరటాల చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

విజయ్ దేవరకొండ స్టార్ కావొచ్చు. కానీ కొరటాల అంతకుమించి. ఇతడి డిమాండ్ ముందు విజయ్ దేవరకొండ చాలా తక్కువ. అలాంటి కొరటాల, దేవరకొండతో సినిమా చేయాలని ఉందంటూ ప్రకటించడం అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. విజయ్ ను పొగిడే క్రమంలో ఏదో కొరటాల అలా మాట్లాడేశాడని కొందరు అంటుంటే.. లేదు నిజంగానే సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ మరికొందరు వాదించుకున్నారు.

జనాలు ఇలా వాదించుకోవడానికి ఓ రీజన్ ఉంది. కొరటాల కాస్త ఆలోచించే స్టేట్ మెంట్ లు ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడంటే అది ఆషామాషీగా ఉండదు. త్వరలోనే ఓ మంచి స్క్రిప్ట్ తో విజయ్ దేవరకొండను కలుస్తానని కొరటాల చెప్పాడంటే, భవిష్యత్తులో ఎప్పటికైనా వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఆశించొచ్చు.

భరత్ అనే నేను సినిమాతో బ్లాక్ బస్ట్రర్ కొట్టిన కొరటాల శివ, ప్రస్తుతం చిరంజీవి సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ స్టోరీలైన్ తో చిరును ఇంప్రెస్ చేసిన ఈ దర్శకుడు, ప్రస్తుతం ఆ కథకు తుదిమెరుగులు దిద్దుతున్నాడు.

First Published:  2 Oct 2018 2:23 AM GMT
Next Story