Telugu Global
NEWS

ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ

ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల రేవంత్ రెడ్డి ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సుధీర్ఘంగా సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించారు. ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌ సింహా, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఐటీ అధికారులు ఓటుకు నోటు […]

ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ
X

ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల రేవంత్ రెడ్డి ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సుధీర్ఘంగా సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించారు.

ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌ సింహా, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఐటీ అధికారులు ఓటుకు నోటు కేసుపైన దర్యాప్తు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

ఈనెల మూడున తమ ముందు హాజరు కావాలని వీరికి నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి మోసుకొచ్చిన 50లక్షల రూపాయలు ఎక్కడివన్న కోణంలోనే వీరిని ఐటీ అధికారులు విచారించనున్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో చెప్పిన మిగిలిన నాలుగున్నర కోట్లు ఎక్కడ ఉన్నాయన్నది తేల్చనున్నారు.

ఐటీ అధికారులు, ప్రభుత్వం ఈ ఓటుకు నోటు కేసు విచారణను బ్యాగులు మోసిన రేవంత్ రెడ్డి, ఇతర చోటా వ్యక్తులతో సరిపెడుతుందా? లేక వీరందరినీ ఆడించిన చంద్రబాబు వరకు వెళ్తుందా? అన్నది కాలమే నిర్ణయించాలి.

First Published:  1 Oct 2018 12:26 AM GMT
Next Story