Telugu Global
CRIME

కిడారి హత్య వెనుక టీడీపీ నేత.... త్వరలో అరెస్ట్‌ ?

ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య వెనుక వైసీపీ ప్రమేయం కూడా ఉండవచ్చన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వాదన అబద్దమని తేలిపోయింది. కిడారిని హత్య చేసేందుకు స్థానిక టీడీపీ నేతలే మావోయిస్టులకు కావాల్సినంత సాయం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ టీడీపీ నేతలు ఎవరన్న దానిపైనా పోలీసులు నిర్ధారణకు వచ్చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాని పక్షంలో త్వరలోనే వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కిడారి హత్య కోసం మండల టీడీపీ […]

కిడారి హత్య వెనుక టీడీపీ నేత.... త్వరలో అరెస్ట్‌ ?
X

ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య వెనుక వైసీపీ ప్రమేయం కూడా ఉండవచ్చన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వాదన అబద్దమని తేలిపోయింది. కిడారిని హత్య చేసేందుకు స్థానిక టీడీపీ నేతలే మావోయిస్టులకు కావాల్సినంత సాయం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఈ టీడీపీ నేతలు ఎవరన్న దానిపైనా పోలీసులు నిర్ధారణకు వచ్చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాని పక్షంలో త్వరలోనే వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కిడారి హత్య కోసం మండల టీడీపీ నేత ఒకరు మూడు సార్లు మావోయిస్టులకు ఆశ్రయం కల్పించారు.

కిడారిని గ్రామసభకు రప్పించడం వెనుక కూడా టీడీపీ నేత హస్తం ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. కిడారిని హత్య చేయాలని నిర్ణయించుకున్న మావోయిస్టులు రాజకీయంగా అతడితో ఎవరు విభేదిస్తున్నారన్న కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు టీడీపీ నేతలు మావోయిస్టులతో చేతులు కలిపారు.

తొలుత ఒక టీడీపీ ఎంపీటీసీతో ఆగస్టు నెలలోనే మావోయిస్టులు చర్చలు జరిపారు. అతడి ద్వారా టీడీపీ మండల నాయకుడితో భాగస్వామ్యం అయ్యారు. సెప్టెంబర్‌ 5నే కిడారి హత్యకు ప్లాన్ చేసిన మావోయిస్టులు టీడీపీ ఎంపీటీసీ, టీడీపీ మండల నాయకుడి ద్వారా ఎమ్మెల్యేను రప్పించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ రోజే గ్రామానికి రావల్సిన కిడారి… తన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్లాడు. దాంతో తొలిసారి ప్లాన్‌ పనిచేయలేదు.

సెప్టెంబర్ 23న తప్పకుండా వస్తానని ఎమ్మెల్యే కిడారి ఇద్దరు టీడీపీ నేతలకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేశారు. కిడారి హత్య కోసం పరిసరాలను పరిశీలించేందుకు గ్రామానికి వచ్చిన మావోయిస్టులకు టీడీపీ నేతలే దగ్గరుండి అక్కడి అనుకూల, ప్రతికూల అంశాలను వివరించారు.

సెప్టెంబర్‌ 23న ఎమ్మెల్యే వస్తున్న విషయాన్ని, ప్రతి కదలికను మావోయిస్టులకు ఈ టీడీపీ నేతలే చేరవేశారు. దీంతో ప్లాన్‌ పక్కాగా అమలు చేసిన మావోయిస్టులు ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను చంపేశారు. టీడీపీ నేతల ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలను పోలీసులు సేకరించారు. వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

First Published:  1 Oct 2018 12:34 AM GMT
Next Story