Telugu Global
Cinema & Entertainment

హై-క్వాలిటీ ప్రింట్ వచ్చేసింది.... ఇక కష్టమే

దేవదాస్ సినిమాకు ఇప్పటికే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. థియేటర్లలో ఓవైపు సినిమా నడుస్తున్నప్పటికీ, మరోవైపు విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా సినిమా లీక్ అవ్వడం యూనిట్ కు మరింత ఇబ్బందికరంగా మారింది. అవును.. దేవదాస్ సినిమా పైరసీకి గురైంది. ఇదేదో ఆషామాషీగా లీక్ చేసిన క్లిప్ కాదు. ఎవరో కావాలనే అత్యంత పకడ్బందీగా లీక్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఇంటర్నెట్ లో దేవదాస్ సినిమాకు సంబంధించి హై-క్వాలిటీ మూవీ లీక్ అయింది. పైరసీ […]

హై-క్వాలిటీ ప్రింట్ వచ్చేసింది.... ఇక కష్టమే
X

దేవదాస్ సినిమాకు ఇప్పటికే మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. థియేటర్లలో ఓవైపు సినిమా నడుస్తున్నప్పటికీ, మరోవైపు విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా సినిమా లీక్ అవ్వడం యూనిట్ కు మరింత ఇబ్బందికరంగా మారింది.

అవును.. దేవదాస్ సినిమా పైరసీకి గురైంది. ఇదేదో ఆషామాషీగా లీక్ చేసిన క్లిప్ కాదు. ఎవరో కావాలనే అత్యంత పకడ్బందీగా లీక్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఇంటర్నెట్ లో దేవదాస్ సినిమాకు సంబంధించి హై-క్వాలిటీ మూవీ లీక్ అయింది.

పైరసీ ప్రింట్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. సెల్ ఫోన్ లేదా కెమెరాతో రికార్డు చేస్తారు. ఆ ప్రింట్ ను ఇంటర్నెట్ లో లీక్ చేస్తుంటారు. కానీ దేవదాస్ సినిమా పైరసీ ప్రింట్ అలా లేదు. సెల్ ఫోన్ లేదా కెమెరాతో తీసిన నాసికరం ప్రింట్ కాదిది. నేరుగా ఎడిట్ సూట్ నుంచి ఇంటర్నెట్ లోకి వచ్చినట్టుంది. అంత హై-క్వాలిటీ ప్రింట్ ను లీక్ చేశారు ఎవరో.

తాజా లీక్ తో దేవదాస్ సినిమాకు మరిన్ని కష్టాలు తప్పవని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు అక్కడక్కడ నెగిటివ్ టాక్ రావడం, వీకెండ్ ముగియడం, పైపెచ్చు పైరసీకి గురవ్వడంతో.. సోమవారం నుంచి ఈ సినిమా దారుణంగా పడిపోతుందని అంచనా వేస్తున్నారు.

First Published:  1 Oct 2018 7:33 AM GMT
Next Story