Telugu Global
Cinema & Entertainment

'అంతరిక్షం' పని పూర్తయింది

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న ‘అంతరిక్షం 9000 KMPH ‘ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. హీరో వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించాడు. షూటింగ్ స్పాట్ లో దిగిన ఓ ఫోటో ని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. మొదటి సినిమా ‘ఘాజి’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం […]

అంతరిక్షం పని పూర్తయింది
X

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న ‘అంతరిక్షం 9000 KMPH ‘ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.. హీరో వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించాడు. షూటింగ్ స్పాట్ లో దిగిన ఓ ఫోటో ని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశాడు.

మొదటి సినిమా ‘ఘాజి’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.. హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు.. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు..

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పటివరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు పెరిగాయి.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అంతరిక్షం.

First Published:  1 Oct 2018 9:35 AM GMT
Next Story