Telugu Global
National

వంట చేయండి.. జుట్టు పెంచండి.. నోరుజారిన ఆనందీ బెన్

గుజరాత్ మాజీసీఎం.. ప్రస్తుత మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తన అపరిపక్వ, బేలతనపు మాటలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆనందీ బెన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్గర్ జిల్లాలో గల కస్తూర్బా బాలిక హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా బాలికల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మాజీ రాజకీయ నాయకురాలు వారికి గురువుగా మారి పాఠశాల విద్యపై బోధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా కార్యక్రమాలను ప్రశంసించారు. అనంతరం బాలికల హాస్టల్ లోని వంటగదిని పరిశీలించి…. విద్యార్థులకు […]

వంట చేయండి.. జుట్టు పెంచండి.. నోరుజారిన ఆనందీ బెన్
X

గుజరాత్ మాజీసీఎం.. ప్రస్తుత మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తన అపరిపక్వ, బేలతనపు మాటలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆనందీ బెన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్గర్ జిల్లాలో గల కస్తూర్బా బాలిక హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా బాలికల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మాజీ రాజకీయ నాయకురాలు వారికి గురువుగా మారి పాఠశాల విద్యపై బోధించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా కార్యక్రమాలను ప్రశంసించారు. అనంతరం బాలికల హాస్టల్ లోని వంటగదిని పరిశీలించి…. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను కోరారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆనందిబెన్ నోరు జారారు. బాలికలు ఎంత బాగా చదివి.. ఎంత బాగా పైకి ఎదిగినప్పటికీ.. ఆడవాళ్లకే ప్రత్యేకమైన వంటగదిని మాత్రం ఎప్పుడూ మరిచిపోకూడదని సూచించారు. భర్త, సంసారాన్ని ముందుకు నడిపించాలంటే బాలికలందరూ రుచికరమైన వంటలను చేయాల్సి ఉంటుందని.. అందుకే వారి తల్లి, చుట్టాల నుంచి వంటలు చేయడం నేర్చుకోవాలని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. బాలికల వేషధారణ గురించి కూడా ఆనంది బెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలందరూ తమ జుట్టును కత్తిరించుకోకూడదని.. ఆడవాళ్లకు పొడుగు జుట్టే అందమని.. దీనికి గర్వపడాలని సూచించారు. బాలికలు జుట్టు కత్తిరించుకోకుండా వారి తల్లిదండ్రులు చూడాలంటూ కోరారు.

ఇక ఈ వివాదాస్పద వ్యాఖ్యలు పూర్తయ్యాక.. మధ్యప్రదేశ్ గవర్నర్ క్విజ్ మాస్టర్ అవతారం ఎత్తారు.. మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరు అంటూ బాలికలను ప్రశ్నించారు. కొంత మంది తడబడగా.. అక్కడే ఉన్న వార్డెన్ ను ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి వీరికి దేశంలోని ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకుల పేర్లపై బోధించాలని ఆదేశించారు.

ఇటీవల కాలంలో ఆనందిబెన్ పటేల్ వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజలతో సమావేశాలు, పరస్పర చర్చల్లో ఆమె మాటలు వార్తల్లో నిలుస్తున్నాయి. గవర్నర్ అయ్యిండి కొన్ని నెలల క్రితం సాట్నా జిల్లాలో ప్రభుత్వ అధికారులు, బీజేపీ నాయకులతో మాట్లాడుతూ.. ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు. అది మీడియా కెమెరాకు చిక్కి అభాసుపాలయ్యారు. రెండు నెలల క్రితం కూడా హర్ధా జిల్లాలో పర్యటిస్తూ అక్కడి సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి ‘ఆయన అవివాహితుడు’ అంటూ నోరుజారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని బాలికలకు చెప్పాల్సిన చోట.. వంట చేసుకోవాలని.. జట్టు పెంచుకోవాలని అంటూ మరో వివాదానికి తెరతీశారు.

First Published:  1 Oct 2018 5:22 AM GMT
Next Story