Telugu Global
NEWS

పాదయాత్ర.... కలవర పెడుతూ ఉందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా పైకి అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి. తెలుగుదేశం నేతలు పైకి అయితే పాదయాత్రను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ… లోలోపల మాత్రం పాదయాత్ర టెన్షన్ పతాక స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. జగన్ పాదయాత్రకు ఎక్కడ అయినా ఒకే రీతిన జనం వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జగన్ కోసం జనాలు […]

పాదయాత్ర.... కలవర పెడుతూ ఉందా?
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా పైకి అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి. తెలుగుదేశం నేతలు పైకి అయితే పాదయాత్రను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ… లోలోపల మాత్రం పాదయాత్ర టెన్షన్ పతాక స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. జగన్ పాదయాత్రకు ఎక్కడ అయినా ఒకే రీతిన జనం వస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జగన్ కోసం జనాలు వస్తున్నారు.

ఎక్కడో ఒక చోట సభ పెట్టి అక్కడ జనాలను చూపిస్తే అదో లెక్క. ఎక్కడ నుంచో జనాలను తోలి ఉంటారు కాబట్టి అలాంటి సభల్లో జనాలు బాగా కనిపించారని అనుకోవచ్చు.

అయితే జగన్ మోహన్ రెడ్డి సభ పెడుతున్నది ముందస్తు ఏర్పాట్లను చేసుకుని కాదు. నడుస్తూ నడుస్తూ కూడళ్లలో సభలు పెడుతున్నాడు. దీని కోసం వైసీపీ ముందస్తుగా ఏర్పాట్లు పెద్దగా చేసినట్లు ఏమీ కనిపించడం లేదు కూడా. జగన్ నడుస్తున్నంత సేపూ జనాలను అరేంజ్ చేయగలడం సాధ్యం కాదు. ప్రజల నుంచి స్పందన ఉన్నప్పుడే జగన్ వెంట అంత మంది కనిపించే అవకాశం ఉంది. అది స్పష్టం అయిపోతూ ఉంది.

ఇక జగన్ కూడళ్లలో పెట్టే సభలకు జనం వస్తున్న తీరు తెలుగుదేశం పార్టీ గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఆ పార్టీ నేతలు మరీ ఈ స్థాయి ఆదరణా…. అని ఆశ్చర్యపోతున్నారు. పైకైతే పాదయాత్రను తీసి వేసే మాటలు మాట్లాడుతున్నారు కానీ.. లోలోపల మాత్రం ఇది గుబులు పుట్టిస్తోందని తెలుస్తోంది.

ఇప్పటికే తెలుగుదేశం నేతలు తమ తమ నియోజకవర్గాల్లో సొంత సర్వేలను కూడా చేయిస్తున్నారట. ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థాయికి చేరిందనే స్పందన ఈ సర్వేల్లో తేటతెల్లం అయ్యిందని తెలుస్తోంది.

వైసీపీ వీక్ గా ఉందనుకున్న ఉత్తరాంధ్రలో కూడా జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం, వైసీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని, తెలుగుదేశం పార్టీలో కలవరాన్ని పుట్టిస్తోందని సమాచారం.

First Published:  29 Sep 2018 8:26 PM GMT
Next Story