Telugu Global
International

ఫుల్ టైమ్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ రై..రై...

కెప్టెన్ గా సత్తా చాటుకొన్న రోహిత్ శర్మ రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియాకు రెండో టైటిల్ ఫుల్ టైమ్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ సిద్ధం వన్డే క్రికెట్లో టీమిండియా స్టాండిన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ మరోసారి తన సత్తా చాటుకొన్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన 2018 ఆసియాకప్ టోర్నీలో పాల్గొన్న టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రధాన కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వటంతో స్టాండిన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ […]

ఫుల్ టైమ్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ రై..రై...
X
  • కెప్టెన్ గా సత్తా చాటుకొన్న రోహిత్ శర్మ
  • రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియాకు రెండో టైటిల్
  • ఫుల్ టైమ్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ సిద్ధం

వన్డే క్రికెట్లో టీమిండియా స్టాండిన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ మరోసారి తన సత్తా చాటుకొన్నాడు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన 2018 ఆసియాకప్ టోర్నీలో పాల్గొన్న టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రధాన కెప్టెన్ విరాట్ కొహ్లీకి విశ్రాంతి ఇవ్వటంతో స్టాండిన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు.

గ్రూప్ లీగ్ లో రెండుకు రెండు, సూపర్ ఫోర్ రౌండ్లో మూడుకు రెండు రౌండ్ల విజయాలు సాధించడంలోనే కాదు… ఫైనల్లో బంగ్లాదేశ్ ను 3 వికెట్లతో అధిగమించడంలోనూ రోహిత్ శర్మ ప్రధానపాత్ర వహించాడు. టీమిండియాను అజేయంగా నిలపడం ద్వారా… తాను పూర్తిస్థాయిలో కెప్టెన్సీ చేపట్టడానికి సిద్ధమని చెప్పకనే చెప్పాడు.

గతంలో శ్రీలంక వేదికగా ముగిసిన ముక్కోణపు టీ-20 సిరీస్ లో టీమిండియాను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ… ఇప్పుడు ఆసియాకప్ లాంటి వన్డే టోర్నీలో సైతం… విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు.

పాపం! బంగ్లాదేశ్….

2018 ఆసియాకప్ ఫైనల్లో… రెండోర్యాంకర్ కమ్ డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా ప్రత్యర్థి,…7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ ను 3 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ఏడోసారి టైటిల్ అందుకొంది.

1988 నుంచి 2018 వరకూ…. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…. టీమిండియాదే పైచేయిగా ఉంది.

ప్రస్తుత ఆసియాకప్ ఫైనల్స్ వరకూ రెండుజట్లూ 35 సార్లు తలపడితే… టీమిండియా 29, బంగ్లాదేశ్ ఐదు విజయాల రికార్డుతో ఉన్నాయి.

ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. 1995 నుంచి 2018 మధ్యకాలంలో రెండు జట్లు ముఖాముఖీ 10 మ్యాచ్ ల్లో ఢీ కొంటే టీమిండియా 9 విజయాలు, బంగ్లాదేశ్ ఒక్క గెలుపు రికార్డుతో ఉన్నాయి.

మరో వైపు…. గత 16 సంవత్సరాల కాలంలో…. టీమిండియా ఆసియాకప్ ఫైనల్స్ కు ఎనిమిదిసార్లు చేరి…. ఏడోసారి విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టు టీమిండియా మాత్రమే.

ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఆసియాకప్ ఫైనల్స్ చేరినా… బంగ్లాదేశ్ జట్టు మాత్రం రన్నరప్ స్థానాలతోనే సరిపెట్టుకోక తప్పలేదు.

First Published:  29 Sep 2018 8:20 PM GMT
Next Story