Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ బాటపట్టిన నితిన్ హీరోయిన్

తెలుగు లేదా తమిళ్ లో ఓ మోస్తరు క్రేజ్ వచ్చిన తర్వాత ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ వైపు చూస్తుంది. సౌత్ లోనే పెద్దగా క్రేజ్ లేని టైమ్ లో బాలీవుడ్ ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్నే అందుకుంది హీరోయిన్ మేఘా ఆకాష్. ఈమెకు అనుకోకుండా బాలీవుడ్ ఆఫర్ వరించింది. ఆ సినిమా పేరు శాటిలైట్ శంకర్. ఆదిత్య పంచోలీ కొడుకు సూరజ్ పంచోలీ హీరోగా నటించనున్న ఈ సినిమాలో అతడి సరసన […]

బాలీవుడ్ బాటపట్టిన నితిన్ హీరోయిన్
X

తెలుగు లేదా తమిళ్ లో ఓ మోస్తరు క్రేజ్ వచ్చిన తర్వాత ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ వైపు చూస్తుంది. సౌత్ లోనే పెద్దగా క్రేజ్ లేని టైమ్ లో బాలీవుడ్ ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన అవకాశాన్నే అందుకుంది హీరోయిన్ మేఘా ఆకాష్. ఈమెకు అనుకోకుండా బాలీవుడ్ ఆఫర్ వరించింది. ఆ సినిమా పేరు శాటిలైట్ శంకర్. ఆదిత్య పంచోలీ కొడుకు సూరజ్ పంచోలీ హీరోగా నటించనున్న ఈ సినిమాలో అతడి సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది మేఘా ఆకాష్.

నితిన్ సరసన ”లై” సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మేఘా. ఆ తర్వాత నితిన్ తోనే ఛల్ మోహన్ రంగ అనే సినిమా చేసింది. దురదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాలూ ఫ్లాప్ అవ్వడంతో మేఘాకు మళ్లీ అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళ్ లో ధనుష్ సరసన ఓ సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. అక్కడ కూడా ఆమె క్రేజ్ అంతంత మాత్రమే. ఇలాంటి టైమ్ లో ఈమెకు బాలీవుడ్ ఆఫర్ రావడం నిజంగా గొప్ప విషయం.

మిలట్రీ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది శాటిలైట్ శంకర్ సినిమా. ఈ సినిమా కథలో దక్షిణాది ఛాయలు కూడా ఉంటాయట. అందుకే ఏరికోరి మేఘా ఆకాష్ ను సెలక్ట్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఆదిత్య పంచోలీ స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

First Published:  29 Sep 2018 10:30 PM GMT
Next Story