Telugu Global
Cinema & Entertainment

ఒకే సినిమా.... ముగ్గురు హీరోయిన్లు

ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం రవితేజకు కొత్తకాదు. తను నటించిన ఎన్నో సినిమాల్లో ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆడిపాడాడు మాస్ రాజా. కానీ ఒకేసారి ముగ్గురు హీరోయిన్లతో రవితేజ నటించిన సినిమాలు మాత్రం లేవు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు రవితేజ నటించిన ఏ సినిమా తీసుకున్నా అందులో ముగ్గురు హీరోయిన్లు లేరు. ఇప్పుడా రికార్డును కూడా అందుకోబోతున్నాడు మాస్ రాజా. త్వరలోనే వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. ఇందులో రవితేజ సరసన ముగ్గురు […]

ఒకే సినిమా.... ముగ్గురు హీరోయిన్లు
X

ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం రవితేజకు కొత్తకాదు. తను నటించిన ఎన్నో సినిమాల్లో ఇద్దరు ముద్దుగుమ్మలతో ఆడిపాడాడు మాస్ రాజా. కానీ ఒకేసారి ముగ్గురు హీరోయిన్లతో రవితేజ నటించిన సినిమాలు మాత్రం లేవు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు రవితేజ నటించిన ఏ సినిమా తీసుకున్నా అందులో ముగ్గురు హీరోయిన్లు లేరు. ఇప్పుడా రికార్డును కూడా అందుకోబోతున్నాడు మాస్ రాజా.

త్వరలోనే వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. ఇందులో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. కథ ప్రకారం, ముగ్గురు ముద్దుగుమ్మలు ఉండాల్సిందేనట. అందుకే ఇలా ఫిక్స్ అయ్యారు. ఈ ముగ్గురిలో ఇప్పటికే ఒకర్ని ఫిక్స్ చేశారు. నన్ను దోచుకుందువటే సినిమాతో పాపులర్ అయిన నభా నటేష్ ను సెలక్ట్ చేశారు.

ఇక మరో హీరోయిన్ గా ఇలియానాను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఇలియానాతో అమర్-అక్బర్-ఆంటోనీ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. వీఐ ఆనంద్ సినిమాలో కూడా గోవా బ్యూటీనే రిపీట్ చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే మిగతా హీరోయిన్ల వివరాలతో పాటు.. సినిమా అప్ డేట్స్ బయటకు రానున్నాయి. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

First Published:  28 Sep 2018 11:21 PM GMT
Next Story