Telugu Global
Cinema & Entertainment

సైనా నెహ్వాల్ బయోపిక్ ఫస్ట్ లుక్

బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితం, కెరీర్ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. ఈ పాత్ర కోసం దాదాపు 6 నెలలుగా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తూ, నటిస్తోంది శ్రద్ధ. ఈ సినిమాలో శ్రద్ధకపూర్ లుక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా జనాల్లో ఉంది. అందుకే కాస్త ముందుగానే సైనా నెహ్వాల్ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సైనా నెహ్వాల్ గా శ్రద్ధాకపూర్ అతికినట్టు సరిపోయింది. సైనా […]

సైనా నెహ్వాల్ బయోపిక్ ఫస్ట్ లుక్
X

బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితం, కెరీర్ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. ఈ పాత్ర కోసం దాదాపు 6 నెలలుగా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తూ, నటిస్తోంది శ్రద్ధ. ఈ సినిమాలో శ్రద్ధకపూర్ లుక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా జనాల్లో ఉంది. అందుకే కాస్త ముందుగానే సైనా నెహ్వాల్ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

సైనా నెహ్వాల్ గా శ్రద్ధాకపూర్ అతికినట్టు సరిపోయింది. సైనా మేనరిజమ్స్, బ్యాడ్మింటన్ డ్రెస్ లో ఉన్న శ్రద్ధాకపూర్ లుక్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. టీ-సిరీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు.

రీసెంట్ గా శ్రద్ధాకపూర్ ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది. సహచర క్రీడాకారుడు కశ్వప్ ను ఆమె త్వరలోనే వివాహం చేసుకోబోతోంది. ఈ ఎపిసోడ్ ను బయోపిక్ లో పొందుపరిచారా లేదా అనే అంశంపై మాత్రం యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు శ్రద్ధాకపూర్ మాత్రం ఈ సినిమాలో సైనా సాధించిన విజయాలన్నింటినీ చూపించబోతున్నామని ప్రకటించింది.

First Published:  29 Sep 2018 5:08 AM GMT
Next Story