Telugu Global
NEWS

లోకేష్ దెబ్బకు అలర్ట్ అవుతున్న బాలయ్య!

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది లోకేష్ బాబు. ఇప్పటికే లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయక పోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూనే లోకేష్ బాబు మంత్రి అయ్యాడు. కానీ.. ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపి మంత్రి పదవిని తీసుకుని ఉంటే అదో ముచ్చట. అయితే లోకేష్ బాబు నామినేటెడ్ పోస్టుతో మంత్రి పదవిని తీసుకున్నాడు. వెనుకటికి ఇలాంటి పనులు దొడ్డిదారి పనులు అని స్వయంగా చంద్రబాబు నాయుడే ఆరోపించాడు. అయితే […]

లోకేష్ దెబ్బకు అలర్ట్ అవుతున్న బాలయ్య!
X

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది లోకేష్ బాబు. ఇప్పటికే లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయక పోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూనే లోకేష్ బాబు మంత్రి అయ్యాడు. కానీ.. ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపి మంత్రి పదవిని తీసుకుని ఉంటే అదో ముచ్చట. అయితే లోకేష్ బాబు నామినేటెడ్ పోస్టుతో మంత్రి పదవిని తీసుకున్నాడు.

వెనుకటికి ఇలాంటి పనులు దొడ్డిదారి పనులు అని స్వయంగా చంద్రబాబు నాయుడే ఆరోపించాడు.

అయితే తనయుడి దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు దొడ్డిదారినే అనుసరించాడు. దొడ్డిదారిన లోకేష్ ను ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం లోకేష్ ఖాయంగా పోటీ చేయాల్సి ఉంది. మరి అది జరగాలంటే లోకేష్ కు ఒక నియోజకవర్గం కావాలి. దాన్ని ఎంపిక చేయడానికి చంద్రబాబు నాయుడు ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నాడు.

ఒక ప్రచారం ప్రకారం లోకేష్ వచ్చేసారి హిందూపురం నుంచి పోటీ చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యను అక్కడ నుంచి తప్పించి లోకేష్ పోటీ చేస్తాడని అంటున్నారు. అయితే బాలయ్యకు ఆ సీటును వదులుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. సీటును వదులుకోవడానికి ఆయన నిరాకరిస్తున్నాడని సమాచారం. పోటీ చేస్తానని అంటున్నది లోకేష్ అయినా, అల్లుడే అయినా బాలయ్య మాత్రం సీటును వదలడానికి ఇష్టపడటం లేదట.

ఈ నేపథ్యంలో బాలయ్య మరో అడుగు ముందుకు వేశాడని సమాచారం. తాజాగా బాలయ్య హిందూపురం నియోజకవర్గంలో ఓటును కూడా నమోదు చేయించుకున్నాడని తెలుస్తోంది. ఇదంతా హిందూపురంలో పాగా వేసేందుకే అని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సీటు విషయంలో బాలయ్య, లోకేష్ ల మద్య పోటీ మొదలైనట్టుగా ఉంది.

First Published:  29 Sep 2018 6:16 AM GMT
Next Story