Telugu Global
NEWS

కేటీఆర్ సీఎం అయితే.... డిప్యూటీ సీఎం ఇతడేనట....

ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టయితే కనిపిస్తోంది. కానీ ఈ ఎన్నికల తర్వాత కేటీఆర్ ను గద్దెనెక్కిస్తాడా.? లేక జాతీయ రాజకీయాల్లో చాన్స్ వస్తే కేసీఆర్ వెళ్లాక పీఠం అప్పగిస్తారనేది టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ ఎప్పుడో ఒకప్పుడు కేసీఆర్ తర్వాత సీఎం అయ్యే చాన్స్ మాత్రం కేటీఆర్ కే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో […]

కేటీఆర్ సీఎం అయితే.... డిప్యూటీ సీఎం ఇతడేనట....
X

ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టయితే కనిపిస్తోంది. కానీ ఈ ఎన్నికల తర్వాత కేటీఆర్ ను గద్దెనెక్కిస్తాడా.? లేక జాతీయ రాజకీయాల్లో చాన్స్ వస్తే కేసీఆర్ వెళ్లాక పీఠం అప్పగిస్తారనేది టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ ఎప్పుడో ఒకప్పుడు కేసీఆర్ తర్వాత సీఎం అయ్యే చాన్స్ మాత్రం కేటీఆర్ కే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే ఈ ముందస్తు ఎన్నికల్లో కేటీఆర్ చెప్పినట్టు కొన్ని సీట్లు ఇచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ కూడా మొన్నీ మధ్య కేటీఆర్ కోటరీ తయారవుతోందని.. ఆయన మంత్రివర్గంలో తమను ఉండకూడదనే సీటు ఇవ్వలేదని ఆరోపించింది. అంతేకాదు.. హరీష్ వర్గాన్ని పక్కనపెడుతూ కేటీఆర్ కు సన్నిహితులైన వారికే టికెట్లు ఇచ్చారని ఆరోపించింది.

దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్ తన కోటరీని తయారు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఒకవేళ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేటీఆర్ సీఎం అయ్యేలా మద్దతిచ్చేందుకు తన వర్గం వారికి టికెట్లు ఇప్పించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కూడా తాను సీఎం అయితే.. తన కింద డిప్యూటీ సీఎంగా సీనియర్లు ఉంటే ఇబ్బందులు అన్న దృష్టితోనే తన అనుంగు శిష్యుడు, విద్యార్థి నేత ఎంపీ సుమన్ ను అసెంబ్లీ బరిలోకి దింపాడనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే డిప్యూటీ సీఎంగా దళితులకు ఇచ్చే సంప్రదాయం ఉండడంతో బాల్క సుమన్ ను ఆ పోస్టులోకి తీసుకోవాలని కేటీఆర్ ఈ ప్లాన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.

అందుకే ఎంపీగా ఉన్న సుమన్ ను ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును పక్కకు తప్పించి మరీ ఆ సీటును ఇప్పించాడనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది. ఏమో ఎవరి ప్లాన్లు వారికుంటాయి. కోటరీ తయారీతో కేటీఆర్ అన్నీ ముందే సర్దుకుంటున్నారన్న చర్చకు ఈ ఉదంతాలు బలాన్నిస్తున్నాయి.

First Published:  28 Sep 2018 10:39 PM GMT
Next Story