Telugu Global
Cinema & Entertainment

కాంబోడియాలో బెల్లంకొండ, కాజల్

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాంబోడియాలోని అంగ్-కోర్-వాట్ లో జరుగుతోంది. కాంబోడియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ సినిమాకు సంబంధించిన సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. అయితే ఈ పాట షూటింగ్ పక్కనపెడితే…. కాంబోడియాలో బెల్లంకొండ, కాజల్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సుప్రసిద్ధం అంగ్-కోర్-వాట్ దేవాలయంలో ఓ ఫొటో […]

కాంబోడియాలో బెల్లంకొండ, కాజల్
X

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాంబోడియాలోని అంగ్-కోర్-వాట్ లో జరుగుతోంది. కాంబోడియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ సినిమాకు సంబంధించిన సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు.

అయితే ఈ పాట షూటింగ్ పక్కనపెడితే…. కాంబోడియాలో బెల్లంకొండ, కాజల్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సుప్రసిద్ధం అంగ్-కోర్-వాట్ దేవాలయంలో ఓ ఫొటో తీసుకున్నారు బెల్లంకొండ, కాజల్. ఈ స్టిల్ లో బెల్లంకొండ నవ్వుతూ నిల్చుంటే, అతడి భుజాలపై కాజల్ కూర్చొంది. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెల్లంకొండ, కాజల్ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతోంది ఈ స్టిల్.

From the sets of my upcoming film with Teja sir!! Kajal Aggarwal #SiemReap #AngkorWat #shootdiaries

Posted by Bellamkonda Sreenivas on Friday, 28 September 2018

తన సినిమాల్లో ఎప్పుడూ స్టార్ హీరోయిన్లకే ప్రాధాన్యం ఇస్తాడు బెల్లంకొండ. వాళ్లతో మంచిగా ఫ్రెండ్ షిప్ చేసుకుంటాడు. సమంత, తమన్న, పూజా హెగ్డే…. ఇలా చాలామంది హీరోయిన్లు బెల్లంకొండకు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఇప్పుడీ ఫొటో చూస్తుంటే…. బెల్లంకొండ-కాజల్ కూడా మంచి స్నేహితులుగా మారిపోయినట్టు అనిపిస్తోంది.

First Published:  29 Sep 2018 4:45 AM GMT
Next Story